కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ 'హైవే'
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన కేవీ గుహన్ `118`చిత్రంతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే సూపర్‌హిట్ సాధించారు. ప్రస్తుతం కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం `హైవే`. (ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి). రోడ్ జర్నీ నేపథ్యంలో సైకో కిల్లర్-క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి వెంకట్ తలారి నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తుంగతుర్తి ఎంఎల్ఎ గాదరి కిశోర్‌కుమార్ క్లాప్ కొట్టగా ప్రముఖ దర్శకుడు ఎం.వీరభద్రం కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని హీరో ఆనంద్‌దేవరకొండపై చిత్రీకరించారు దర్శకుడు కేవీగుహన్. సైమన్ కె.కింగ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్‌షూటింగ్ జూన్ ఫస్ట్ వీక్ నుండి ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా...
తొలిచిత్రం `చుట్టాలబ్బాయి`తో ఘనవిజయం సాధించిన నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ - ``చుట్టాలబ్బాయి లాంటి సూపర్‌హిట్ తర్వాత మా బేనర్లో చేస్తోన్నసెకండ్ మూవీ `హైవే`. గుహన్‌గారు చెప్పిన కథ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. గుహన్ గారి దర్శకత్వంలో ఆనంద్ హీరోగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్‌పై హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సైమన్ కె. కింగ్ మ్యూజిక్ డైరెక్టర్. హైవే నేపథ్యంలో ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కొంత మంది ఫేమస్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించనున్నారు వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం`` అన్నారు.
దర్శకుడిగా విభిన్నచిత్రాలు అందిస్తున్న కేవీ గుహన్ మాట్లాడుతూ - ``ఆనంద్ దేవరకొండ హీరోగా నేను డైరెక్ట్ చేస్తోన్న`హైవే` మూవీ పూజాకార్యక్రమాలతో ప్రారంభంకావడం సంతోషంగా ఉంది. ప్రీ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తయ్యింది. ఆర్టిస్టుల, టెక్నీషియన్స్ సెలక్షన్ జరుగుతోంది. జూన్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశాం. త్వరలో మరికొంత మంది ఫేమస్ ఆర్టిస్టులతో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాం`` అన్నారు. క్రేజీ హీరో విజయ్‌దేవరకొండ తమ్ముడు, రీసెంట్గా మిడిల్‌క్లాస్ మెలోడీస్ చిత్రంతో అందరికీ ఆకట్టుకున్న
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - ``నేను ఫస్ట్ టైమ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్‌తో వర్క్ చేస్తున్నాను. గుహన్ గారు సూపర్ కెమెరామేన్. ఆయన దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ జర్నీలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాననే నమ్మకం ఉంది. తప్పకుండా ఒక గ్రేట్ మూవీ అవుతుంది. ఇక్కడికి వచ్చిన ఎంఎల్ఎ గాదరి కిశోర్‌కుమార్ మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన గుహన్ గారికి, వెంకట్ తలారి గారికి, రమేష్‌గారికి దన్యవాధాలు`` అన్నారు.
ఈ చిత్రానికి క్లాప్ కొట్టిన తుంగతుర్తి ఎంఎల్ఎ గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ - ``ఈ చిత్ర నిర్మాత వెంకట్ తలారి నాకు అత్యంత సన్నిహితుడు. అలాగే అభిరుచిగల నిర్మాత. గుహన్ గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. కెమెరామేన్‌గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న గుహన్ గారితో ఆనంద్ దేవరకొండ హీరోగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్లో రూపొందుతోన్న ఈ మూవీ మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ బేనర్లో మరిన్ని మంచి మూవీస్‌ని వెంకట్ తలారి తీసుకురావాలని కోరుకుంటున్నా. ఒక శ్రేయోభిలాషిగానే కాకుండా ఒక ఆడియన్ గా ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
కెమెరా స్విచాన్ చేసిన దర్శకుడు ఎం.వీరభద్రం మాట్లాడుతూ - ``శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ తలారి వెంకట్‌గారు నాకు మంచి మిత్రులు. ఆ బేనర్లో నేను డైరెక్ట్ చేసిన తొలిచిత్రం `చుట్టాలబ్బాయి` పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు గుహన్‌గారి దర్శకత్వంలో ఆయన తీస్తున్న రెండవ చిత్రం `హైవే` పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో భారీతారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com