'విమానం' అందరి కథే.. జీఎంఆర్ జీవితంలోనూ, ఆ కలే నేటి ఎయిర్‌పోర్ట్స్: కే. రాఘవేంద్రరావు ఎమోషనల్
Send us your feedback to audioarticles@vaarta.com
శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్కస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘‘విమానం’’. విలక్షణ నటుడు , దర్శకుడు సముద్రఖని ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. అనసూయ, మీరా జాస్మిన్, రాజేంద్రన్ , ధనరాజ్, రాహుల్ రామకృష్ణ, మాస్టర్ ధ్రువన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన విమానం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బస్తీలో వుండే అంగవైకల్యంతో బాధపడే తండ్రి, అతని కొడుకు విమానం ఎక్కాలనే కల ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
కథ చెబుతుంటే కంటి వెంట నీళ్లు :
తాజాగా చిత్ర బృందాన్ని దిగ్గజ దర్శకుడు కే.రాఘవేంద్రరావు అభినందించారు. విమానం ట్రైలర్ చూశానని.. చిన్న సినిమా అయినప్పటికీ ఎంతో ఎమోషన్ వుందన్నారు. జీ ప్రసాద్ ఎందుకు ఈ కథను తీసుకున్నారో తర్వాత అర్ధమైందన్నారు. ట్రైలర్ ఎంతో హార్ట్ టచింగ్ వుందని, సినిమా గురించి చెబుతున్నప్పుడు తన కళ్లు చెమ్మగిల్లాయన్ని రాఘవేంద్రరావు అన్నారు. ఇలాంటి చిన్న సినిమాలను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆదరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి సినిమాలను చూపించాల్సిన ఆవశ్యత ఎంతో వుందని రాఘవేంద్రరావు సూచించారు. తన కొడుకుని విమానం ఎక్కించేందుకు తండ్రి పడే తాపత్రయాన్ని ఆవిష్కరించడమే కాకుండా, మిగిలిన పాత్రలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన ప్రశంసించారు. జీ స్టూడియోస్ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు తీయాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్‌కు రాఘవేంద్రరావు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
భార్య కోసం విస్పాపై వైజాగ్‌కి :
ఇక ఇదే సమయంలో విమానం ఎక్కాలన్నది ఎంతోమంది కల అని చెబుతూ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లిఖార్జున రావు జీవితంలో జరిగిన సంఘటనను దర్శకేంద్రుడు పంచుకున్నారు. జీఎంఆర్‌కు పెళ్లయిన కొత్తలో ఆయన సతీమణి విమానం చూడాలని ముచ్చటపడ్డారని తెలిపారు. దీంతో భార్య కోరిక తీర్చడం కోసం ఆయన తనకున్న విస్పా మీద రాజాం నుంచి విశాఖ విమానాశ్రయానికి వచ్చి అక్కడికి దగ్గరలో వున్న గోడపై నుంచి విమానం చూపించారని రాఘవేంద్రరావు గుర్తుచేశారు. అలాంటి జీఎంఆర్ ఇప్పుడు భారతదేశంతో పాటు ఎన్నో దేశాల్లో గొప్ప గొప్ప విమానాశ్రయాలను నిర్మించారని ఆయన ప్రశంసించారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఒక ఎమోషన్ నింపితే పెద్దయ్యాక గొప్ప విజయాలు సాధిస్తారని రాఘవేంద్రరావు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments