మహిళా దర్శకురాలు జయ.బి మృతి
- IndiaGlitz, [Friday,August 31 2018]
మహిళా దర్శకురాలు జయ.బి (54)గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె పార్థివ దేహాని మహేశ్‌బాబు, వెంకటేశ్, సుకుమార్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్, ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మంచు మనోజ్, గుణశేఖర్, నృత్య దర్శకుడు శేఖర్ సహా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు నివాళులు అర్పించారు.
జర్నలిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి సూపర్‌హిట్ వార పత్రికను మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు జయ. ఓ వార పత్రికను 25 సంవత్సరాల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఘనత దర్శకురాలు జయ.బికి దక్కుతుంది.
సినిమా దర్శకత్వంపై ఆసక్తితో దర్శకురాలిగా మారి.. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం సినిమాలను డైరెక్ట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగాయి.