ఐదు క్లైమాక్స్ ప్రిపేర్ చేసుకున్న దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
దగ్గుబాటి రానా హీరోగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఘాజీ`. 1971లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్‌వాటర్‌లో జరిగిన యుద్ధనేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఆ యుద్ధంలో పాల్గొన్న నౌక పేనే `ఘాజీ`.ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ `యు` సర్టిఫికేట్ పొందింది. సినిమా సెన్సార్ పూర్తి కావడంతో ఫిబ్రవరి 17న విడుదల కానుండటం ఖాయమైంది. .తెహాలీవుడ్ స్టాండర్డ్ టెక్నికల్వర్క్తోభారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా డైరెక్టర్ సంకల్ప్ ఈ మూవీ కోసం ఐదు క్లైమాక్స్‌లను సిద్ధం చేసుకున్నాడట. అయితే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే సమయంలో ఐదు క్లైమాక్స్‌ల్లో ఎలాంటి క్లైమాక్స్ ఉండాలనే దానిపై పలువురితో డిస్కస్ చేసి ఓ క్లైమాక్స్‌ను ఫిక్స్ చేశాడట సంకల్ప్.
రానా దగ్గుబాటి, తాప్సీ, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి, ఓంపురి, నాజర్, రాహుల్ సింగ్, మిలిండ్ గునాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ః ఇ.వి.ఎ.మోషన్ స్టూడియోస్, స్టంట్స్ః జాషువా, ప్రొడక్షన్ డిజైన్ః శివమ్ రావ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః కె, ఎడిటర్ః ఎ.శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీః మది, ఆడిషనల్ స్టోరీ, స్క్రీన్‌ప్లేః నిరంజన్ రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూసర్, పోస్ట్ ప్రొడక్షన్ః ఎన్.ఎం.పాషా, నిర్మాతలుః అన్వేష్ రెడ్డి, జగన్మోహన్రెడ్డి, నిరంజన్ రెడ్డి, పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః సంకల్ప్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com