వెంకీని బాధపెట్టిన డైరెక్టర్....

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

విక్ట‌రీ వెంక‌టేష్ ని బాధ‌పెట్టిన డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు యూత్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...వెంకీ - మారుతి కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం బాబు బంగారం. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఈరోజుల్లో, బ‌స్టాఫ్, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్...త‌దిత‌ర చిత్రాల‌తో యూత్ కాదు బూతు చిత్రాల ద‌ర్శ‌కుడుగా ముద్ర‌ప‌డిన మారుతి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో ఆ ముద్ర‌ను చెరిపోసుకున్నాడు.
దీంతో బాబు బంగారం సినిమా పై క్రేజ్ పెరిగింది. వెంకీ చిత్రాల‌కు ఓవ‌ర్ సీస్ లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా బాబు బంగారం చిత్రానికి మంచి బిజినెస్ జ‌రిగింది. అయితే...మారుతి క‌థ - స్ర్కీన్ ప్లే తో ఈనెల 1న రిలీజైన రోజులుమారాయి చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ముఖ్యంగా సినిమా సెకండాఫ్ ని చూడ‌లేక‌పోతున్నాం అంటూ సినీ విమ‌ర్శ‌కులు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేయ‌డంతో మారుతికి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ తో వ‌చ్చిన ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. దీంతో ఆ ప్ర‌భావం ఈనెల 29న రిలీజ్ కి రెడీ అవుతున్న బాబు బంగారం పై ప‌డుతుందేమో అని వెంకీ తెగ బాధ‌ప‌డుతున్నార‌ట‌.ఇక్క‌డో విష‌యం చెప్పాలి..
నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాలో వెంకీ తండ్రి చంద్ర‌మోహ‌న్ తో బాబు...నువ్వు ఖాళీగా ఉంటే రామ‌కోటి రాసుకో.. ఇలాంటి ఉత్త‌రాలు మాత్రం రాయ‌కు అని అంటాడు. అచ్చు ఈ డైలాగ్ లాగే ఉంది వెంకీ ప‌రిస్థితి అని అంటున్నారు సినీ జ‌నాలు. బాబు మారుతి పెద్ద హీరోతో సినిమా చేస్తున్న‌ప్పుడు ఖాళీగా ఉంటే ఇంకో పెద్ద హీరోకి క‌థ రాసుకో...లేక పోతే రామ‌కోటి రాసుకో అంతే కానీ... సైడ్ ఇన్ క‌మ్ అంటూ రోజులుమారాయి లాంటి క‌థ‌లు రాసి మాతో ఆడుకోకు అని వెంకీ ఫీల‌వుతున్నారంటూ ఫిల్మ్ న‌గ‌ర్ లో ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి..మారుతి మార‌తాడో..మార‌ను నేనింతే అంటాడో చూడాలి.

More News

గోపీచంద్, సంపత్ నందిల కొత్త చిత్రం

`యజ్ఞం`,`ఆంధ్రుడు`,`లక్ష్యం`,`శౌర్యం`,`శంఖం`,`గోలీమార్` వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

నారారోహిత్ ముఖ్యఅతిథిగా జన చైతన్య ర్యాలీ

విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ నటుడుగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్

మెగా క్యాంప్ హీరోతో సుధీర్ హీరోయిన్....

సుధీర్ బాబు హీరోగా మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా గతేడాది విడుదలైన సంగతి తెలిసిందే.

పానీ పూరి అమ్ముతున్న హీరో..

పానీ పూరి అమ్ముతున్న హీరో ఎవరో కాదు మంచు విష్ణు.

ఓం న‌మో వెంక‌టేశాయ లేటెస్ట్ అప్ డేట్..

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న‌నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. ఈ సినిమాని శిరిడి సాయి చిత్రాన్నినిర్మించిన మ‌హేష్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.