ఎన్టీఆర్‌ కొడుకు వదిలితే దూకేసేలా ఉన్నాడుగా..

సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీబిజీగా ఉన్నా ఫ్యామిలీకే ప్రియారిటీ ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పండుగలు ఉంటే మాత్రం విదేశాల్లో ఉన్నా సరే హైదరాబాద్‌లో వాలిపోతాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్న జూనియర్.. హోలీ సందర్భంగా ఫ్యామిలీతో గడిపాడు. ఈ మేరకు హోలీ తాలుకు ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్యూట్‌ పిక్‌లో జూనియర్ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హోలీ ఆడి అనంతరం దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోకు నందమూరి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెల్లటి దుస్తులతో నవ్వులు చిందిస్తూ ఫొటోలో ఉన్నారు. ఈ ఫొటోతో ఫ్యాన్స్ ముచ్చటపడిపోతున్నారు.

కాగా.. ఈ ఫొటోపై ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ రియాక్ట్ అయ్యాడు. ‘ ఈ ఫొటోలో చిన్నోడు.. చూడండి ఎలా ఉన్నాడో.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’ అని ట్వీట్ చేస్తూ.. సూపర్బ్ అని ఉండే ఎమోజీని పోస్ట్ చేశాడు. ‘లిటిల్ టైగర్ ఆన్ ది వే’ అంటూ మరో ట్వీట్ కూడా చేశాడు. మొత్తానికి చూస్తే జూనియర్ కుమారుడికి హరీశ్ ఫిదా అయిపోయాడన్న మాట. ఎన్టీఆర్‌తో ఒక్క హరీశే కాదు దాదాపు అందరు దర్శకులు చాలా మంచిగానే.. మర్యాదగానే మెలుగుతుంటారు.