B.కాంలో ఫీజిక్స్" ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
రెడ్ కార్పెట్ రీల్ ప్రొడక్షన్ పతాకంపై అంకిత, అవంతిక, మేఘన,నగరం సునీల్,జబర్దష్ అప్పారావు నటీ నటులుగా సామ్ జె చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న "B.కాంలో ఫీజిక్స్" చిత్రం ట్రైలర్ హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో..
దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... శ్యామ్ ఈ మధ్య కలసి ఈ సినిమా కథ చెప్పడం జరిగింది. ట్రైలర్ చాలా బాగుంది.ఈ సినిమాలో బోలెడు కంటెంట్ తో పాటు బోల్డ్ కంటెంట్ కూడా ఉంది.సున్నితమైన అంశాన్ని చక్కగా తెరకెక్కిస్తూ ఒక మంచి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్ర దర్శకుడికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి. మరియు చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని అన్నారు.
చిత్ర దర్శక, నిర్మాత సామ్ జె చైతన్య మాట్లాడుతూ .. షారూఫ్ ఖాన్ సినిమా చెన్నై ఎక్స్ ప్రెస్ కు వర్క్ చేసిన రైటర్ దగ్గర 10 సంవత్సరాలు వర్క్ చేసి ఎడిటింగ్, డైరక్షన్ ఫీల్డ్ లలో వర్క్ నేర్చుకొని కన్నడలో రెండు సినిమాలకు డైరెక్షన్ చేసి ప్రొడ్యూస్ చేశాను.తెలుగులో "ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి", "ఏడు చేపల కథ" సినిమాలు తీశాను. మూడవ సినిమా "B.కాంలో ఫీజిక్స్" కు దర్శకత్వం చేసి నిర్మించడం జరిగింది.అమ్మాయిలపై జరుగుతున్న రేప్ లను అరికట్టడానికి ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ లో కూడ అమ్మాయిలపై జరుగుతున్న రేప్ లను అరికట్టాలని తీయడం జరిగుతుంది. ఈ సినిమాలో కూడా రేప్ కు గురైన ఒక అమ్మాయి తన పాయింట్ ఆఫ్ వ్యూ లో వైల్డ్ గా డీసీజన్ తీసుకొని తను సెక్స్ ఆర్గాన్స్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకొని తనను రేప్ చేసిన అబ్బాయినే రేప్ చేసి రివెంజ్ తీర్చుకుంటుంది. వినడానికి కథలో లాజిక్ లేకున్నా ఈ కథలో కామెడీని జోడించి ఎక్పె పేరమెంటల్ గా ఈ సినిమాను తీయడం జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళుతుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే లో సినిమాను విడుదల చేస్తామని అన్నారు.
హీరోయిన్ లో ఒకరైన మేఘన మాట్లాడుతూ... "ఏడూ చేపల కథ" ద్వారా దర్శకుడు మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ మనముందుకు వస్తున్నాడు. ఇప్పటి వరకు చేయని డిఫ్రెంట్ రోల్ ను ఈ సినిమాలో నటించాను.నాకీ అవకాశమిచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
కమెడియన్ అప్పారావు మాట్లాడుతూ.. ఈ బ్యానర్ లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు."అవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి" లో చేసిన పాత్రకు మించి ఇందులో నా పాత్ర ఉంటుంది.సున్నితమైన అంశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రం దర్శక,నిర్మాతలకు గొప్ప విజయం సాధించి మరెన్నో చిత్రాలు నిర్మిస్తూ మాలాంటి వారికి అవకాశం కల్పించాలని అన్నారు.
తారాగణం: అంకిత, అవంతిక, మేఘన,నగరం సునీల్, జబర్దష్ అప్పారావు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout