జ‌గ‌ప‌తిబాబు సినిమా ద‌ర్శ‌కుడెవరంటే...

  • IndiaGlitz, [Saturday,November 05 2016]

సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు హీరో నుండి విల‌న్‌, క్యారెక్ట‌ర్ న‌టుడుగా మారిన సంగ‌తి తెలిసిందే. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారిన త‌ర్వాత బిజీగా మారిన జ‌గ‌ప‌తిబాబు మ‌ళ్ళీ హీరోగా మారుతున్నాడు. ఈ సినిమాను త‌న స్వంత నిర్మాణ సంస్థ జ‌గ‌ప‌తి పిక్చ‌ర్స్‌పై నిర్మిస్తున్నాడు జ‌గ‌ప‌తిబాబు. ప‌టేల్ సార్ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు ఆర‌వైయేళ్ల వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడు.

ఈ సినిమాను తెలుగు, క‌న్న‌డంలో రూపొందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత, క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామి చ‌న్నాంబిక ఫిలింస్ నుండి త‌న స‌హాయ స‌హ‌కారాల‌ను అందించ‌నున్నారు. వాసు ప‌రిమి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమానున డైరెక్ట్ చేయ‌నున్నాడు.

More News

బాల‌య్య కూడా అంతేన‌ట‌

బాల‌య్య ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నామ‌ని నిర్మాత‌లు ప్లాన్ చేశారు.

వెంకీ సినిమాకు ముహుర్తం కుదిరింది

సాలాఖద్దూస్ సినిమాను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, రితిక సింగ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.

ల‌క్కున్నోడు ప్రీ లుక్ పోస్ట‌ర్ రిలీజ్..!

మంచు విష్ణు హీరోగా గీతాంజ‌లి, త్రిపుర ఫేమ్ రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ల‌క్కున్నోడు. ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌న హ‌న్సిక న‌టిస్తుంది. దేనికైనా రెడీ, పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద త‌ర్వాత విష్ణుతో హ‌న్సిక న‌టిస్తున్న మూడ‌వ సినిమా ఇది.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా కాటమరాయుడు, ధృవ, డి.జె, ఫిదా, నేను లోకల్ తదితర ఆడియోలు విడుదల

గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల పాటలను అందించిన ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న క్రేజీ మూవీస్ ఆడియోలను ఆదిత్య మ్యూజిక్ సంస్థ మార్కెట్ లో రిలీజ్ చేయనుంది.

కీర‌వాణి చేతుల మీదుగా షోటైమ్ సాంగ్ రిలీజ్..!

ప్రతిష్ఠాకరమైన రామ గ్రూప్ సినిమా నిర్మాణంలో 'రామ రీల్స్' బ్యానర్ పై నిర్మిస్తున్న తొలి చిత్రం "షో టైమ్''. ప్రేక్షకులకు నూరు శాతం వినోదం అందించాలనే సంకల్పంతో ఉత్తమ విలువలతో అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు 'మర్యాద రామన్న', 'ఈగ' చిత్రాల రచయిత ఎస్. ఎస్. కాంచి చేపడుతున్నారు.