డైరెక్టర్‌కి కోటిన్నర ఫైన్
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా ఓ సక్సెస్ వస్తే ఇండస్ట్రీలో వచ్చే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు పట్టించుకోని చాలా మంది గౌరవిస్తుంటారు. దర్శకుల విషయానికి వస్తే సక్సెస్ కొట్టిన దర్శకుడికి నిర్మాతలు ముందుగానే డబ్బులిచ్చి తమ బ్యానర్‌లో సినిమాలు చేయమని బుక్ చేసుకుంటారు.
ఇలాంటి పరిస్థితే దర్శకుడు విక్రమ్‌కుమార్‌కి వచ్చింది. ఈ దర్శకుడు సాధించిన '13బి', 'ఇష్క్' సక్సెస్‌లతో నిర్మాతలందరూ అడ్వాన్స్‌లిచ్చారు. అలా అడ్బాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో అశ్వినీదత్ ఒకరు. వైజయంతీ మూవీస్‌లో ఓ సినిమా చేసి పెట్టమని అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత విక్రమ్ కుమార్ మనం, 24, హలో చిత్రాలు చేసినా.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో చేయలేదు.
ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్‌కి విక్రమ్‌కుమార్ సినిమా చేయకపోవడంతో అశ్వినీదత్ నిర్మాతల మండలి, డైరెక్టర్స్ కౌన్సిల్‌ను పిర్యాదు చేశాడు. పిర్యాదుపై స్పందించిన రెండు కౌన్సిల్స్ విక్రమ్‌కు కోటిన్నర రూపాయల ఫైన్ విధించారు. తదుపరి చిత్రానికి విక్రమ్ తీసుకోబోయే అడ్వాన్స్‌తో విక్రమ్‌కుమార్ ఈ పేమెంట్ చేయాల్సి ఉంటుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com