యూనిట్‌ను బంగారంగా స‌త్క‌రించిన ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Saturday,August 25 2018]

సినిమా అంటే సాంకేతికంగా ఓ క‌మిట్‌మెంట్‌.. ఓ ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయ్యాక అందులో చేరే టీమ్ మెంబ‌ర్స్ డ‌బ్బులు తీసుకుని ఔట్ పుట్ ఇస్తుంటారు. అయితే ఇది కొన్ని వంద‌ల మంది సినిమా కోసం వ‌ర్క్ చేస్తుంటారు. అలాంటి అంద‌రినీ గుర్తు పెట్టుకుని వారిని ప‌ల‌క‌రించ‌డ‌మే కాదు.. వారి కానుక‌లు ఇస్తే .. ఎంతో బావుంటుంది క‌దా!.. ఇప్పుడు ఈ ట్రెండ్ త‌మిళంలో మొద‌లైంది.

స్టార్ హీరోలు యూనిట్ స‌భ్యులంద‌రికీ భోజ‌నాలు వ‌డ్డిస్తుంటారు. ఆ ట్రెండ్ దాటి.. ఇప్పుడు యూనిట్ స‌భ్యుల‌కు స్పెష‌ల్ బ‌హుమ‌తుల‌ను ఇస్తున్నారు. రీసెంట్‌గా కీర్తిసురేశ్ త‌న యూనిట్ స‌భ్యుల‌కు బంగారు నాణేల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చింది. కాగా ఇప్పుడు ద‌ర్శ‌కుడు లింగుస్వామి.. త‌న పందెంకోడి 2 యూనిట్‌లో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ బంగారు నాణేన్ని బహుమ‌తిగా ఇచ్చాడ‌ట‌.