ప్లాప్ దర్శకుడితో రవితేజ...?

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

మాస్ మహారాజా రవితేజ..చాలా మంది కొత్త దర్శకులకు సపోర్ట్ చేసే హీరోల్లో ఒకడు. తనకి కథ నచ్చితే చాలు. కొత్త దర్శకుడా, ప్లాప్ దర్శకుడా అని చూడకుండా సినిమా చేయడానికి రెడీ అయిపోతాడు. ఇప్పుడు అలాగే మరో ప్లాప్ దర్శకుడితో సినిమా చేయడానికి రవితేజ రెడీ అయిపోయాడని ఫిలింనగర్ టాక్.

దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన ఓ మై ఫ్రెండ్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడట. వేణు చెప్పిన కథ, అందులో హీరో క్యారెక్టరైజేషన్ నచ్చడంతో రవితేజ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని. అల్రెడీ బెంగాల్ టైగర్' ముగింపు దశకు చేరుకోవడంతో రవితేజ తన నెక్స్ ట్ మూవీ రంగం సిద్ధం చేసుకుంటున్నాడనేది టాక్.