ప్రియా ప్రకాష్‌తో మాట్లాడనంటున్న దర్శకుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
`ఒరు ఆడార్ లవ్`(తెలుగులో లవర్స్ డే) చిత్రంలో `మాణిక్య మలరయ` సాంగ్‌లో కొంటె చూపుతో కన్నుగీటి రాత్రికి రాత్రే నేషనల్ రేంజ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ పేరు సంపాదించుకుంది. అయితే ఈ క్రేజే దర్శకుడికి నిర్మాతలకు గొడవ పెట్టిందట. ప్రియా ప్రకాష్‌కి వచ్చిన క్రేజ్‌తో నిర్మాతలు కథను ఆమెకు అనుకూలంగా మార్చమని ఒత్తిడి చేశారట. కథను దర్శకుడు తనకు ఇష్టం లేకపోయినా మార్చాడట.
మెయిన్ హీరోయిన్ నూరీర్ షరీష్ బాగా నటించినా.. కథ మార్చడంతో ఆమెకు గుర్తింపు దక్కలేదట. నిర్మాత.. సినిమా విడుదల తర్వాత దర్శకుడికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదట. కాబట్టి తాను ప్రియా ప్రకాష్ వారియర్‌తో మాట్లాడటం లేదని దర్శకుడు ఒమర్ లులు చెప్పాడు. న్యూరీన్ షరీష్ కూడా తనకు ప్రియా ప్రకాష్ వారియర్ వల్లే రావాల్సిన పేరు రాలేదని దయ్య బట్టిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments