వైసీపీ తరఫున పోటీ చేయలేకపోయిన డైరెక్టర్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన సినీ ఇండస్ట్రీకి చెందిన వారంతా విజయ దుందుభి మోగించారు. ముఖ్యంగా.. హీరో మార్గాని భరత్, కొద్దిరోజుల నిర్మాతగా వ్యవహరించిన ఎంవీవీ సత్యనారాయణ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోదరుడు గణేష్ ఈ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో గెలుపొందారు. అయితే విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేసిన పీవీపీ మాత్రం గెలవలేకపోయారు. అతి తక్కువ ఓట్లతో పీవీపీపై టీడీపీ అభ్యర్థి కేశినేని నాని గెలిచారు. ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనను కూడా పోటీ చేయాలని వైసీపీ నుంచి పిలుపు వచ్చిందని అయితే తనకు అంత శక్తి, సామర్థ్యాలు లేవని మిన్నకుండిపోయానని మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ చెప్పుకొచ్చారు. అసలేం జరిగింది..? ఇంటర్వ్యూలో ఆయనేం చెప్పారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
"గతంలో నన్ను వైసీపీ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించారు. పోటీ చేసేందుకు కావాల్సిన శక్తి నాకు లేదని భావించి తిరస్కరించాను. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా తండ్రి వైఎస్‌ను ఎంతో అభిమానించేవారు.. అప్పట్లో ఆయన రాజకీయాల్లో కొనసాగారు. ప్రస్తుతం నా సోదరుడు సురేంద్ర వైసీపీలో ఉన్నారు. నా తల్లి చనిపోయిన సమయంలో జగన్ స్వయంగా ఇంటికి వచ్చి ఓదార్చారు. ఒక దశలో వైఎస్ బావమరిది.. 'యోగి' చిత్ర నిర్మాత రవీందర్ రెడ్డి నన్ను ఎన్నికల్లో పోటీ చేయాలని అడిగారు. అప్పట్లో నా తల్లి కూడా రాజకీయాల్లోకి వెళ్లేందుకు అంగీకరించలేదు. నాన్న రాజకీయాల్లో తిరిగి డబ్బు పోగొట్టుకోవడంతో మీ చిన్నప్పుడు మీకు ఏమీ చేయలేకపోయాం. రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక ఉంటే.. పిల్లలు ఎదిగాక ప్రయత్నించాలని సూచించారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి ఆలోచిస్తాను" అని వినాయక్ చెప్పుకొచ్చారు.
కాగా.. బహుశా ఈ టెర్మ్‌లో ఆయన ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసుంటే కచ్చితంగా విజయం సాధించి ఉండేవారు. అసెంబ్లీకో.. పార్లమెంట్‌కో వెళ్లి గళం వినిపించి ఉండేవారేమో. మరి వినాయక్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com