ఆ వార్తలను నమ్మద్దు అంటున్న డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం మిస్టర్. ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి నిర్మించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాలి. కానీ...కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం ప్రారంభం అయ్యింది. అయితే..ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో స్పెయిన్ లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రం కూడా ఆగిపోయింది అంటూ ప్రచారం ప్రారంభం అయ్యింది. ఈ ప్రచారం పై డైరెక్టర్ మలినేని గోపీచంద్ ట్విట్టర్ లో స్పందిస్తూ....ఇలాంటి ఫాల్స్ న్యూస్ ని నమ్మద్దు. స్ర్కిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని తెలియచేసారు. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com