రామ్ సినిమా తోనూ కొనసాగించిన దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది విడుదలైన 'నేను లోకల్' సినిమాతో దర్శకుడిగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం.. గురువారం హైదరాబాద్ లో ప్రారంభమైంది.
మార్చి 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాల టైటిల్స్ అన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా.. హిట్ అయిన సినిమాల పాటల పల్లవులలోని లైన్ లను తన సినిమాలకు టైటిల్స్ గా పెట్టడం ఈ దర్శకుడికి ఆనవాయితీగా మారింది.
ఓసారి త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలపై లుక్కేస్తే.. 'మేం వయసుకు వచ్చాం' ('7/జి బృందావనం కాలనీ'), 'ప్రియతమా నీవచట కుశలమా..!' ('గుణ'), 'సినిమా చూపిస్త మావ' ('రేసు గుర్రం'), ప్రస్తుతం 'హలో గురు ప్రేమ కోసమే' ('నిర్ణయం').. ఇలా తన సినిమాల టైటిల్స్ అన్నీ పాపులర్ పాటల పల్లవుల నుంచి పుట్టినవే కావడం విశేషం. ఒక్క 'నేను లోకల్' మాత్రమే ఇందుకు విరుద్ధంగా ఉంది. మున్ముందు కూడా ఆయన ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com