స్టార్ హీరో సంస్థ‌పై ఫిర్యాదు చేసిన డైరెక్ట‌ర్

  • IndiaGlitz, [Monday,January 27 2020]

గ‌త ఏడాది ఓ బడా సీనియ‌ర్ క‌థానాయకుడు ఓ హిస్టారిక‌ల్ మూవీలో నటించాడు. స‌ద‌రు హీరో త‌న‌యుడు, ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేసి ఉండ‌టంతో త‌న బ్యాన‌ర్లోనే భారీ బడ్జెట్‌తో సినిమాను తెర‌కెక్కించాడు. పాన్ ఇండియా చిత్రంగా సినిమా విడుద‌లైంది. అయితే తెలుగు లాంగ్వేజ్‌లో మిన‌హా మ‌రే భాష‌లోనూ సినిమా స‌క్సెస్ కాలేదు. డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో బ‌య్య‌ర్లు స‌హా స‌ద‌రు హీరో క‌మ్ ప్రొడ్యూస‌ర్ న‌ష్టాల‌నే చ‌వి చూడాల్సి వ‌చ్చింది. సినిమా రిలీజ్ వ‌ర‌కు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు బ్యాలెన్స్ పెట్టేశాడు. సినిమా రిలీజైన త‌ర్వాత ఏవో డబ్బులు వ‌స్తాయ‌నుకుంటే అవి కూడా రాలేదు.

దీంతో స‌ద‌రు సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడికి కూడా మూడు కోట్ల రూపాయ‌లు మేర‌కు పెండింగ్ పెట్టేశాడ‌ట‌. సినిమా విడుద‌లై చాలా రోజుల‌వుతుంది. పోనీ వ‌దిలేద్దామ‌నుకుంటే భారీ మొత్తమాయే! అందువ‌ల్ల ద‌ర్శ‌కుడికి అంత రెమ్యున‌రేష‌న్‌ను వ‌దులుకోవాలంటే మ‌న‌సు రాలేదు. దాంతో త‌న‌కు రావాల్సిన రెమ్యున‌రేష‌న్ గురించి ద‌ర్శ‌కుల సంఘంలో ఫిర్యాదు చేశాడ‌ట‌.

స్టార్ హీరో కావ‌డంతో విష‌యాన్ని బ‌య‌ట‌కు పొక్క‌నీయ‌కుండా.. ద‌ర్శ‌క సంఘం పెద్ద‌లు రంగంలోకి దిగి స‌ద‌రు నిర్మాత‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఇద్ద‌రికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు గ‌ట్టిగానే చేస్తున్నార‌నేది స‌మాచారం.