#మీటూ ప్యాష‌నైపోయింద‌న్న డైరెక్ట‌ర్

  • IndiaGlitz, [Friday,October 12 2018]

కాస్టింగ్‌కౌచ్‌.. లైంగిక బాధింపులపై బాలీవుడ్‌లో మీటూ ఉద్య‌మం జోరుగా సాగుతుంది. ఎంతో మంది మ‌హిళ‌లు త‌మ ఎదుర్కొన్న లైంగిక ఇబ్బందులను ఆరోపిస్తున్నారు. నానా ప‌టేక‌ర్‌, అలోక్‌నాథ్‌, కైలాష్ ఖేర్‌, ర‌జ‌త్ క‌పూర్‌, వికాల్ బెహ‌ల్‌, సుభాష్ క‌పూర్‌, అర్జున ర‌ణ‌తుంగ‌, మ‌లింగ పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సుభాయ్ ఘాయ్ పేరు కూడా వ‌చ్చింది.

జ్యూస్‌లో మ‌త్తు మందు క‌లిపి త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని ఓ మ‌హిళ సుభాష్ ఘాయ్‌పై ఆరోప‌ణ‌లు చేసింది. దీనిపై సుభాష్ స్పందిస్తూ..' మీ టూ ఫ్యాష‌న్ అయిపోయింది. ఇత‌రుల పేర్లు చెడ‌గొట్ట‌డానికి ఈ ప‌నులు చేస్తున్నారు. నాపై ఆరోప‌ణ‌లు చేస్తున్న యువ‌తి ఆధారాలు చూప‌కుంటే ఆమెపై దావా వేస్తాను' అన్నారు.