లక్కీ మంత్లో వస్తున్న దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎ.కరుణాకరన్.. ఈ పేరు వినగానే కుటుంబసమేతంగా చూడదగ్గ ప్రేమకథా చిత్రాలు కళ్ళముందు కదలాడుతాయి. తొలిప్రేమ(1998)తో దర్శకుడిగా పరిచయమైన కరుణాకరన్.. తొలి సినిమాతోనే ఘనవిజయం అందుకున్నారు. ఆ తరువాత కొన్ని పరాజయాలు పలకరించినా.. ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)తో మరోసారి అందుకున్నారు.
పదేళ్ళ గ్యాప్లో వచ్చిన ఈ రెండు చిత్రాలు కూడా జూలై నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు కావడం విశేషం. కట్ చేస్తే.. మళ్ళీ పదేళ్ళ తరువాత అదే జూలై నెలలో తన కొత్త చిత్రం తేజ్ ఐ లవ్ యుతో కరుణాకరన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని వినిపిస్తోంది.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా... క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18తో చిత్రీకరణ పూర్తిచేసుకోనున్న ఈ సినిమా.. జూలై ప్రథమార్థంలో విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి లక్కీ మంత్లో ఈ సారి కూడా కరుణాకరన్ హిట్ అందుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments