ప్రదీప్ మాట్లాడుతుండగా.. స్టేజిపైనే కుప్పకూలిన డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆనందంగా సాగిపోతున్న ప్రెస్మీట్లో ఊహించని ఘటన షాక్కు గురి చేసింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి చేస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా సినిమా గతేడాది విడుదలకు నోచుకోలేదు. దీంతో జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రి రిలీజ్ ఈవెంట్స్ లాంటి వాటిన్నింటికీ బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రెస్మీట్ తాజాగా హైదరాబాద్లో జరిగింది.
ఈ ప్రెస్మీట్లో‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. తమ చిత్రానికి ఆది నుంచి సపోర్టును అందిస్తున్న మీడియాకు.. అలాగే సినీ పరిశ్రమలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హీరో ప్రదీప్ మాట్లాడుతూ.. తమ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్కు ‘నీలి నీలి ఆకాశం’ వంటి అద్భుతమైన పాటను అందించిన చంద్రబోస్కు ధన్యవాదాలు తెలిపాడు.
కాగా.. ప్రదీప్ మాట్లాడుతుండగానే స్టేజీపై ఆయన వెనుక నిలుచొని ఉన్న దర్శకుడు మున్నా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రదీప్తో పాటు స్టేజిపైనే ఉన్న ఇతర చిత్రబృందం ఆయనకు మంచి నీళ్లు అందించి.. స్టేజీపై నుంచి కిందకు తీసుకెళ్లి ప్రథమ చికిత్సను అందించారు. పని ఒత్తిడి కారణంగా ఏమాత్రం రెస్ట్ లేకపోవడంతో మున్న అలా హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయినట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments