వివాదంపై దర్శకుడి వివరణ
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రస్తుతం `వాల్మీకి` సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై అనంతపురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల షూటింగ్ కోసం అక్కడకు వెళ్లిన వాల్మీకి యూనిట్‌ను అక్కడ వాల్మీకి సంఘం అడ్డుకుంది. దీనిపై హరీశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
`మేం వాల్మీకి సంఘం అభిప్రాయాల్ని గౌరవిస్తాం. వాల్మీకిని పూజించిన రాముడు యుద్ధం చేశాడు. మా సినిమాలో హీరో పేరు వాల్మీకి కాదు` అన్నారు. తమిళ చిత్రం `జిగర్ తండా`కు ఇది రీమేక్. ఇందులో హీరో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. సెప్టెంబర్ 6న `వాల్మీకి` చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments