వివాదంపై ద‌ర్శ‌కుడి వివ‌ర‌ణ‌

  • IndiaGlitz, [Saturday,July 06 2019]

డైరెక్ట‌ర్ హరీశ్ శంక‌ర్ ప్ర‌స్తుతం 'వాల్మీకి' సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై అనంత‌పురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేసింది. స్థానికంగా పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవ‌ల షూటింగ్ కోసం అక్క‌డ‌కు వెళ్లిన వాల్మీకి యూనిట్‌ను అక్కడ వాల్మీకి సంఘం అడ్డుకుంది. దీనిపై హ‌రీశ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

'మేం వాల్మీకి సంఘం అభిప్రాయాల్ని గౌర‌విస్తాం. వాల్మీకిని పూజించిన రాముడు యుద్ధం చేశాడు. మా సినిమాలో హీరో పేరు వాల్మీకి కాదు' అన్నారు. త‌మిళ చిత్రం 'జిగ‌ర్ తండా'కు ఇది రీమేక్‌. ఇందులో హీరో గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. సెప్టెంబ‌ర్ 6న 'వాల్మీకి' చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

ప్ర‌భాస్‌కు య‌శ్ రెక‌మండేష‌న్‌

`బాహుబ‌లి`తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్‌కు క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ రెక‌మండేష‌న్ చేశాడు.

కంగ‌నా స‌ర్‌ప్రైజ్‌

బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు త‌న దృష్టంతా ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాల‌పైనే పెట్టింది. `మ‌ణిక‌ర్ణిక‌`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను కంగనా త‌న ఖాతాలో వేసుకున్నారు.

క‌పిల్‌లా మారిన ర‌ణ‌వీర్ సింగ్.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. ఈ త‌రుణంలో 1983 ప్ర‌పంచ క‌ప్ జ‌ర్నీని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కుతున్న చిత్రం `83`.

దొరసాని కోసం ఎదురుచూసాను... శివాత్మిక రాజశేఖర్

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’

'కె ఎస్‌ 100' ఆడియన్స్ కి మంచి అనుభూతి ఇచ్చే రొమాంటిక్‌ హారర్‌ చిత్రం - నిర్మాత కె. వెంకట్‌రామ్‌రెడ్డి

చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై కె. వెంకట్‌రామ్‌రెడ్డి నిర్మాతగా మోడలింగ్‌ స్టార్స్‌ సమీర్‌ ఖాన్‌, సునీతా పాండే, శైలజా తివారి, ఆశిరాయ్‌, శ్రద్దా శర్మ,