చీప్స్టార్పై దర్శకుడి వివరణ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్.ఎక్స్ 100తో హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి. ఈయన తన రెండో సినిమాను స్టార్ట్ చేయడానికి మాత్రం చాలా సమయాన్నే తీసుకుంటున్నారు. అందుకు కారణం కథ సిద్ధంగా ఉన్నా.. అందులో సూటబుల్గా నటించే హీరోలు లేకపోవడమే. మొన్నటి వరకు రవితేజ, సిద్ధార్థ్లతో సినిమా చేయడానికి అజయ్ భూపతి సిద్ధమైయ్యాడు. అయితే చివరి నిమిషంలో రవితేజ డ్రాప్ కావడంతో అజయ్ భూపతికి కోపం వచ్చింది. చీప్స్టార్ అంటూ ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యింది. అసలు ఎవరు? ఈ చీప్ స్టార్ అని సినీ వర్గాల్లో చిన్నపాటి డిబేటే నడిచింది. అయితే ఎట్టకేలకు డైరెక్టర్ అజయ్ భూపతి ఓ ఆంగ్ల పత్రికకు ఈ విషయమై వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణలో ఎక్కడా రవితేజను చిన్న మాట కూడా అనలేదు. నిజమే ఆ హీరో నా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇంతకు మించి ఈ విషయంపై ఇప్పుడేమీ స్పందిచలేను. ఆ పాత్రలో హీరో కోసం వెతుకుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు.
రెమ్యునరేషన్ కారణం...
అజయ్ భూపతి సినిమా నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం రెమ్యునరేషనే అని అందరూ అనుకుంటున్నారు. రవితేజ ఇప్పుడు తన సినిమాలకు దాదాపు తొమ్మిది కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అందులో ఏమాత్రం తగ్గినా ఒప్పుకోవడం లేదట. ఇదే పేచీతోనే అజయ్ భూపతి సినిమా నుండి రవితేజ డ్రాప్ అయ్యాడని వార్తలు వినిపించాయి. ఇదే విషయాన్ని రవితేజ విశ్వసనీయ వర్గాలు కూడా వెల్లడించాయి. నిజంగానే రెమ్యునరేషనే అసలు సమస్య అని తేల్చిచెప్పాయి.
రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. తర్వలోనే చిత్రీకరణ కూడా పూర్తి కానుంది. దీని తర్వాత రవితేజ చేయబోయే సినిమాపై క్లారిటీ లేదు. మరి త్వరలోనే రవితేజ తన తదుపరి చిత్రంపై నిర్ణయానికొస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments