కల్యాణ్ రామ్ చెప్పడంతో మూవీ టైటిల్ మార్చిన డైరెక్టర్

  • IndiaGlitz, [Monday,January 13 2020]

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడ‌వురా’. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. కాగా.. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుని ఎలాంటి క‌ట్స్ లేకుండా క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేస్తున్నారు.

ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు!?
ఈ సంద‌ర్భంగా సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం షురూ చేసింది. తాజాగా.. కల్యాణ్ రామ్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. అయితే సినిమాకు ‘ఎంత మంచివాడ‌వురా’ కాకుండా మరో పేరు అనుకున్నారట. ఆ విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాడు. ‘‘ఈ సినిమాలో హీరో ఏదీ నెగెటివ్‌గా తీసుకోడు. ఆయన అనుకున్నదే పాజిటివ్‌గా ఆలోచిస్తుంటూ ముందుకెళ్తుంటాడు. అలా తాను ఉండటమే కాకుండా మిగతావారిని మార్చడానికే ప్రయతత్నాలు చేస్తుంటాడు. సతీశ్ వేగేశ్నగారి కథ, మాటలు ఈ సినిమాకి బలం. ముందుగా ఈ సినిమాకి ఆయన ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే తెలుగుదనం నిండిన టైటిల్ అయితే బాగుంటుందని నా అభిప్రాయాన్ని చెప్పాను. ఆ తర్వాత ‘ఎంత మంచివాడవురా’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ తరహా కథను నేను చేస్తున్నట్టు చెప్పినప్పుడు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆనందపడ్డాడు. ఈ కథ అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకుంది’ అని కల్యాణ్ రామ్ చెప్పాడు.

More News

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌కు వైఎస్ జగన్ కీలక పదవి!?

ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆ చానెల్‌కు చైర్మన్‌గా ఉన్న థర్టీ ఇయర్స్ పృథ్వీ సరస సంభాషణ జరపడంతో ఆ వ్యవహారం చివరికి రాజీనామా దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.

మీరెందుకు అలాంటి సినిమాలు చేయ‌రు అని అడిగారు: కల్యాణ్ రామ్

`అత‌నొక్క‌డే` నుండి `118` వ‌ర‌కు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ల్యాణ్‌రామ్‌.

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా  'ఈ కథలో పాత్రలు కల్పితం'

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ  మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో

చరణ్ కోసం కియారా.. దర్శకుడు గట్టి ప్రయత్నాలు!!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే

బాలయ్య-బోయపాటి సినిమా నుంచి ప్రముఖ టెక్నీషియన్ ఔట్

బాలయ్య-బోయపాటి సినిమాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొదట బడ్జెట్ .. ఆ తర్వాత రెమ్యునరేషన్ గొడవ..