‘బిచ్చగాడు 2’కి డైరెక్టర్ మార్పు..!
Send us your feedback to audioarticles@vaarta.com
‘బిచ్చగాడు’ .. ఓ అనువాద సినిమా అయినా కూడా తెలుగు ప్రేక్షకులు సినిమాకు భారీ విజయాన్ని అందించారు. ఎంత పెద్ద విజయం అంటే సూపర్‌స్టార్స్ సినిమాలు విడుదలైనా కూడా ప్రేక్షకులు ‘బిచ్చగాడు’ సినిమాకే ఓటేశారంటే.. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 2020లో ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ మూవీ చేయబోతున్నట్లు విజయ్ ఆంటోని తెలిపారు. కానీ కరోనా రావడంతో ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లడానికి ఆలస్యమైంది. కరోనా లాక్డౌన్ తర్వాత విజయ రాఘవన్‌ను చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ ఆంటోని బిచ్చగాడు2 పై అనౌన్స్మెంట్ ఇచ్చాడు.
ఆసక్తికరమైన విషయమేమంటే.. ‘బిచ్చగాడు 2’ చిత్రానికి విజయ్ ఆంటోని డైరెక్టర్ పేరుని అనౌన్స్ చేశాడు. విజయ రాఘవన్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద కృష్ణన్ ‘బిచ్చగాడు 2’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని చెప్పాడు. అయితే నిజానికి ముందు ‘బిచ్చగాడు2’ డైరెక్టర్‌గా ప్రియా కృష్ణస్వామిని అనుకున్నారు. ప్రకటన కూడా విడుదలైంది. అయితే మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. ఇప్పుడు డైరెక్టర్ మారాడు. ప్రియా కృష్ణస్వామి స్థానంలో ఆనంద కృష్ణన్ వచ్చి చేరాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com