Bobby: చిరంజీవి గారు, రవితేజ గారితో కలసి సినిమా చేయడం నా అదృష్టం : దర్శకుడు బాబీ
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు బాబీ కొల్లి విలేఖరుల సమావేశంలో 'వాల్తేరు వీరయ్య' విశేషాలని పంచుకున్నారు.
సంక్రాంతికి భారీ పోటీ వుంది కదా.. ఒత్తిడి అనిపిస్తుందా ?
అదేంలేదండీ. వేరే నిర్మాతలు అయితే ఒత్తిడి ఉండొచ్చేమో..ఒకే నిర్మాతలు కాబట్టి రెండు ఫలితాలు బావుండాలని పాజిటివ్ గా ఎదురుచుస్తున్నాం.
'వాల్తేరు వీరయ్య' బ్యాక్ స్టొరీ చెప్పండి ?
'వాల్తేరు వీరయ్య బ్యాక్ స్టొరీ చెప్పాలంటే ముందు నా బ్యాక్ స్టొరీ చెప్పాలి. చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ బాయ్ గా 2003 నా జర్నీ మొదలైయింది. చిరంజీవి గారి సినిమాలో పని చేయాలనే ఒక కల వుండేది. ఇప్పుడు 2023లో మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన సినిమా విడుదలౌతుంది. నా జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్ ఇది.
స్వయంకృషి తో ఎదిగిన చిరంజీవి గారు, రవితేజ గారు లాంటి స్టార్స్ తో వర్క్ చేయడం ఎంత కిక్ ఇచ్చింది ?
చిరంజీవి గారు, రవితేజ గారు ఎలా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారో నేను కూడా ఏ సపోర్ట్ లేకుండా వచ్చాను. వాళ్ళిద్దరితో సినిమా చేయడం నా అదృష్టం. మాస్ ఆడియన్స్ ఏం కావాలో అనే దానిపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టి డిజైన్ చేయడం జరిగింది.
చిరంజీవి గారి సినిమా అనేసరికి ఖచ్చితంగా హిట్టు కొట్టాలనే ఒత్తిడి ఉందా ?
లేదండీ. మెగాస్టార్ గారు ఎన్నో విజయాలు బ్లాక్ బస్టర్లు అలాగే కొన్ని అపజయాలు కూడా చూసుంటారు. ఆయనకి ఉన్నంత బ్యాలెన్స్ ఎవరికీ ఉండదని కూడా చెప్పొచ్చు. అలాగే రవితేజ గారు కూడా అంతే. ఒక సినిమాకి చేయాల్సిన న్యాయం కష్టం సర్వస్వం పెడతారు. ఫలితం మాత్రం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని బలంగా నమ్ముతారు.
'వాల్తేరు వీరయ్య' కోసం అందరూ ఫ్యాన్స్ లా పని చేశాం అని చెప్పారు.. ఇలా ఫ్యాన్ సెంట్రిక్ అవడం వలన రెగ్యులర్ ఆడియన్స్ ని మర్చిపొతున్నామనే భావన కలుగుతుంది కదా ?
నిజానికి ఈ కథ లాక్ డౌన్ కి ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చెప్పాను. అయితే లాక్ డౌన్ లో పరిస్థితులు మారిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీకీ అలవాటు పడ్డారు. డిఫరెంట్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అందరినీ అలరించే కథ చెప్పాలని ప్రత్యేక ద్రుష్టి పెట్టాం. దాంట్లో నుండి వచ్చిన క్యారెక్టరే రవితేజ గారిది. ఒక ఫ్యాన్ బాయ్ గా మొదలుపెట్టి ఒక డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్ డిజైన్ చేశాను. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది. బీసి సెంటర్ ఆడియన్స్ తో పాటు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని కూడా అలరించే అన్ని గుణాలు లక్షణాలు వాల్తేరు వీరయ్యలో కనిపిస్తాయి.
చిరంజీవి గారు, రవితేజ గారి కాంబినేషన్ ఎలా వుండబోతుంది ? వాల్తేరు వీరయ్య కథ ఏమిటి ?
ప్రతి సీన్ లో ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్ వుంటాయి. పండక్కి రాబోతున్న కలర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్యూటీఫుల్ ఎమోషన్స్ వున్న చిత్రం వాల్తేరు వీరయ్య.
వాల్తేరు వీరయ్య టైటిల్ పెట్టడానికి కారణం.. ?
'వెంకీ మామ' షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో వున్నప్పుడు చిరంజీవి గారి నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోల వలనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా నోస్టాలిజిక్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బావుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం.
వాల్తేరు వీరయ్యలో రవితేజ గారిది క్యామియో రోల్ నా ?
అది ఇప్పుడు చెప్పను. మీరు 13వ తేదిన చూడాలి. రవితేజ లేకుండా వాల్తేరు వీరయ్య సినిమాలేదని మాత్రం చెప్పగలను.
మీరు గోపీచంద్ మలినేని గారు కలసి పని చేశారు కదా.. ఇప్పుడు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఎలా అనిపిస్తుంది ?
నేను రైటర్ గా గోపి డైరెక్టర్ గా చాలా కాలం జర్నీ చేశాం. మేమిద్దరం బ్రో అని పిలుచుకుంటాం. ఒకే బ్యానర్ లో ఇప్పుడు రెండు సినిమాలతో రావడం చాలా అనందంగా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కలిశాం. ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాం. ఇద్దరి సినిమాకు ప్రేక్షకులని బలంగా ఆకట్టుకుంటాయని నమ్మకంగా వున్నాం.
రవితేజ గారి చాయిస్ ఎవరిది ?
రవితేజ గారి చాయిస్ నాదే. రవితేజ గారిని తీసుకోవాలనే ఆలోచన రావడం, చిరంజీవి గారికి చెప్పడం, ఆయన మరో ఆలోచన లేకుండా ఓకే అనడం, చిరంజీవి గారిపై వున్న ప్రేమ అభిమానం, నాపై వున్న నమ్మకంతో రవితేజ గారు ఒప్పుకోవడం జరిగింది.
ఇందులో ముఠామేస్త్రీ గ్యాంగ్ లీడర్ లాంటి వింటేజ్ లుక్ కనిపిస్తోంది. కథ అనుకున్నపుడే ఇలా డిజైన్ చేశారా ?
వాల్తేరు వీరయ్య పాత్రలో ఆ లిబర్టీ వుంది. ఆయన లుంగీ కట్టుకోవచ్చు, బీడీ తాగొచ్చు, రౌడీ అల్లుడు స్వాగ్ ఉండొచ్చు . గ్యాంగ్ లీడర్ లా గన్ పట్టుకొని వార్ కి రావచ్చు. ఆ ఫ్రీడమ్ అంతా వీరయ్య క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది తప్పితే బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు.
వాల్తేరు వీరయ్యలో కామెడీ గురించి చెప్పండి ?
చిరంజీవి గారి డ్యాన్స్ తో పాటు ఫన్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఫన్ టైమింగ్ లో ఆయన మాస్టర్ . మనం ఫన్ ఇవ్వగలిగితే దాన్ని స్కై లెవల్ కి తీసుకెళ్ళిపోతారాయన. ఆ మ్యాజిక్ అంతా చూస్తూ పెరిగాను. ఈ ఎనర్జీ అంతా ఆయన నుండి తీసుకోవడం జరిగింది.
పూనకాలు లోడింగ్ గురించి చెప్పండి ?
ఇప్పుడు ప్రతి సినిమాకి హ్యాష్ టాగ్ లు పెడుతున్నారు. కొత్త గా వుండాలి మాస్ కి తెలిసుండాలి అలాంటి టాగ్ గురించి ఆలోచిస్తున్నపుడు పూనకాలు లోడింగ్ అనే టాగ్ అయితే బావుంటుందని అనుకున్నాం. ఈ టాగ్ ని అందరూ రిఫరెన్స్ గా తీసుకోవాలని అనుకున్నాం., మేము అనుకున్నట్లే ఇప్పుడు అందరూ లోడింగ్ అనే మాటని పాజిటివ్ వైబ్ గా వాడుతున్నారు. ఈ విషయంలో మేము సక్సెస్ అయినట్లే.
ఇద్దరు హీరోలని బ్యాలెన్స్ చేస్తున్నపుడు అభిమానుల విషయంలో ఒత్తిడి వుంటుందా ?
వాల్తేరు వీరయ్యలో నాకున్న సౌలభ్యం ఏమిటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్, రవితేజ గారి ఫ్యాన్స్ ఒకటే. చిరంజీవి గారిని అభిమానించే ఫ్యాన్స్ రవితేజ గారిని కూడా ఎంతగానో అభిమానిస్తారు. ఆలాగే చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగానని రవితేజ గారు ఎన్నో సార్లు చెప్పారు. ఈ విషయంలో చిరంజీవి గారు కూడా ఎంతో ఆనందంగా వుంటారు. ఫ్యాన్స్ అందరూ ఇద్దరి నీ ఒకేలా ప్రేమిస్తారని మా నమ్మకం. పూనకాలు లోడింగ్ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ దీనికి నిదర్శనం.
వాల్తేరు వీరయ్య ఫస్ట్ కాపీ మీరు చూశారు.. ఎలా అనిపించింది ?
నేను చూడటం కంటే 153 సినిమాలు చేసిన చిరంజీవి గారు నేను చేసిన సినిమా చూస్తున్నారంటే నాకు రెండు రాత్రుల నిద్రలేదు. ఆయన జడ్జ్మెంట్ చాలా పక్కాగా వుంటుంది. వాల్తేరు వీరయ్య మొత్తం చూసి ‘’వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం బాబీ’’ అన్నారు. ఆ రోజు నేను గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకున్న ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేను. చిరంజీవి గారి లాంటి మాస్ మూలవిరాట్ నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం సర్రియల్ మూమెంట్. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా.
దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి ?
చిరంజీవి గారిది దేవిశ్రీ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాల్తేరు వీరయ్య ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా థియేటర్ కి వచ్చే ముందు మొదట గెలిచేది ఆడియో పరంగా. అలా మమ్మల్ని గెలిపించిన దేవిశ్రీ ప్రసాద్ గారి కి మా టీం అందరి తరపున కృతజ్ఞతలు.
ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారి గురించి ?
ఏఎస్ ప్రకాష్ గారు ఒక సీనియర్ ఆర్ట్ డైరెక్టర్. ఆయనకి మనం ఏ ఇన్ పుట్స్ ఇవ్వడానికి పెద్ద హోం వర్క్ అవసరం లేదు. కథ చెప్పినప్పుడే వరల్డ్ మొత్తాన్ని అర్ధం చేసుకుంటారు. బాస్ పార్టీ సాంగ్ ఒక జాలరీ పేట షిప్పియార్డ్ కల్చర్ లో వుండాలి. ఆయన అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ గురించి ?
మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి పని చేయాలని ఎప్పటినుండో వుండేది. ఇలాంటి సమయంలో నవీన్ గారు సినిమా చేద్దామని అడిగారు. తర్వాత జర్నీ మొదలైయింది. అద్భుతమైన నిర్మాతలు. సినిమా అంటే ప్యాషన్. సినిమాకి ఏం కావాలో ఎక్కడ రాజీ పడకుండా సమకూరుస్తారు.
'వాల్తేరు వీరయ్య'కి సీక్వెల్ ఉంటుందా ?
ఇప్పటికైతే లేదండీ. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కోరిక బట్టి ఆ దిశగా ఆలోచిస్తాం.
వాల్తేరు వీరయ్య హిందీ రిలీజ్ గురించి చెప్పండి ?
చిరంజీవి గారికి , రవితేజ గారికి హిందీలో మంచి మార్కెట్ వుంది. ఈ ఇద్దరు హీరోలు అక్కడి ఆడియన్స్ కి చాలా ఇష్టం. వాల్తేరు వీరయ్య తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేస్తున్నారు నిర్మాతలు.
పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచన ఉందా ?
పాన్ ఇండియా రాజమౌళి గారు మనికి ఇచ్చిన అద్భుతమైన ఫ్లాట్ ఫామ్. అలాంటి కథ దొరికితే
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments