సినిమా ప్లాప్‌కి విజయ్ దేవరకొండ కారణమంటున్న డైరెక్టర్!!
- IndiaGlitz, [Saturday,February 22 2020]
సినిమా మేకింగ్ సమయంలో అన్నీ సరిగ్గానే ఉంటాయి. హిట్ అయితే అందరూ దాని ఫలితాన్ని పొందాలనుకుంటారు. అదే ప్లాప్ అయితే ఒకరిపై ఒకరు కారణంగా చెప్పేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు డైరెక్టర్ క్రాంతి మాధవ్ పరిస్థితి అలాగే తయారైంది. రీసెంట్‌గా ఈయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ప్లాప్ కావడం వల్ల ఎక్కువగా లాస్ అయ్యింది మాత్రం డైరెక్టర్ క్రాంతి మాధవ్, నిర్మాత కె.ఎస్.రామారావేనట.
విజయ్ దేవరకొండ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఏ ఒక్కటి హిట్ అయినా తను వెను తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. ఉంగరాల రాంబాబు సినిమా ప్లాప్‌తో డీలా పడ్డ క్రాంతి మాధవ్.. ఈ సినిమాపై చాలా ఆశలనే పెట్టుకున్నాడు. పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ వేలు పెట్టి మార్పులు, చేర్పులు చేశాడట. సినిమా విడుదల తర్వాత డైరెక్టర్ క్రాంతి మాధవ్ తన మనసులో బాధనంత హీరోతో చెప్పేశాడట. స్క్రిప్ట్‌లో అనవసరంగా వేలు పెడితే ఫలితం ఇలాగే ఉంటుందని వాపోయాడట. ఏదైతేనేం సినిమా విడుదలైపోయింది.. మరిప్పుడు ఈ అనుభవంతో విజయ్ దేవరకొండ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.