వీడియోలు అప్లోడ్, వేధింపులకు గురైన లేడి సింగర్.. దర్శకుడు అరెస్ట్!

  • IndiaGlitz, [Saturday,July 17 2021]

చిత్ర పరిశ్రమలో నటీమణులు, లేడి సింగర్స్, అప్ కమింగ్ ఆర్టిస్టులపై తరచుగా జరుగుతున్న వేధింపుల సంఘటనలు వెలుగులోకి రావడం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటన విషయంలో షార్ట్ ఫిలిం డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు. చిత్ర పరిశ్రమలో ఉన్న మహిళలతో పరిచయం పెంచుకోవడం ఆ తర్వాత వారిని వేధింపులకు గురి చేయడం పరిపాటిగా మారిపోయింది.

వివరాల్లోకి వెళితే.. మోడికాయల నవీన్ కుమార్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. అతడి వయసు 34 ఏళ్ళు. షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. గతంలో నవీన్ కుమార్ టాలీవుడ్ లో ఓ ప్రముఖ లేడి సింగర్ ని ఇంటర్వ్యూ చేశాడు. అలా ఆమెతో నవీన్ కుమార్ కు పరిచయం ఏర్పడింది.

అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత విషయాలు ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. ఆమె ఫోటోని లోగోగా చేసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఆమె పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసేశాడు. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ లు అప్లోడ్ చేయడం ప్రారంభించాడు.

చివరకు సింగర్ వ్యక్తిగత విషయాలని కూడా వీడియోలు చేస్తూ వైరల్ చేశాడు. ఇందంతా ఆపమని సింగర్ హెచ్చరించినా వినలేదు. దీనితో ఆమె మానసిక వేదనకు గురైంది. నిందితుడు సింగర్ వ్యక్తిగత విషయాలపై ఫోకస్ పెడుతూ ఆమెని బాధించసాగాడు. దీనితో సింగర్ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది.

ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సింగర్ ని వేధింపులకు గురిచేసిన వ్యవహారంలో అతడి నుంచి మరిన్ని విషయాలు రాబడుతున్నారు.

More News

విరాటపర్వంలో 'అల వైకుంఠపురములో' నటి.. అందాల భామ నక్సలైట్ గా..

వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ఇది.

'కుడి ఎడమైతే' వెబ్ సిరీస్ రివ్యూ

ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ఒరిజినల్ వెబ్ సిరీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. తాజాగా నేడు ఆహా మరో వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. టైటిల్ తోనే ఆసక్తిరేపిన వెబ్ సిరీస్ 'కుడి ఎడమైతే'.

క్రేజీ విలన్ కూతురితో స్టార్ క్రికెటర్ రొమాన్స్.. మామగారు కూడా బౌల్డ్

క్రికెటర్స్ తో బాలీవుడ్ భామలు.. ఇది ఎప్పటికి నెవర్ ఎండింగ్ స్టోరీ అనే చెప్పాలి.

RRR కంటే ముందుగానే.. బుల్లితెరపై అల్లూరి, కొమరం భీం?

ఆర్ఆర్ఆర్ టీం విడుదల చేసిన మేకింగ్ వీడియో రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ప్రభాస్ లుక్ లోకి మారిపోయిన బెల్లంకొండ.. లాంచ్ చేసిన రాజమౌళి!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.