క‌మెడియ‌న్ శ్రీనివాస‌రెడ్డిని అభినందించిన ద‌ర్శ‌క‌ధీరుడు

  • IndiaGlitz, [Friday,November 22 2019]

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం 'భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు'. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. డిసెంబ‌ర్ 6న విడుద‌ల సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ చాలా బావుందంటూ ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డి స‌హా ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు. ఇప్పుడు దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ చిత్రంతో ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్న శ్రీనివాస‌రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు.

''నేను కెరీర్‌ను స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుండి శ్రీనివాస‌రెడ్డి నాకు తెలుసు. త‌ను మంచి క‌మెడియ‌న్‌. తొలిసారి 'భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు' సినిమాతో ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచయం అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస‌రెడ్డి అభినంద‌న‌లు తెలుపుతున్నాను'' అంటూ ట్వీట్ చేశారు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల మెగాప్రిన్స్‌ వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.

More News

'అన్నపూర్ణమ్మగారి మనవడు' ఆడియో విడుదల

అక్కినేని అన్నపూర్ణమ్మగా సీనియర్‌ నటి అన్నపూర్ణ, ఆమె మనవడిగా మాస్టర్‌ రవితేజ నటించిన తాజా చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు.

జబర్దస్త్‌లో ఇక నేను కనిపించను.. నాగబాబు

మెగాబ్రదర్ నాగబాబు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ కామెడీ షోకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే.

శివ 143 ట్రైలర్ ను విడుదల చేసిన దర్శకుడు వి.వి.వినాయక్

శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవ రం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం శివ 143..

నాగ చైతన్య కొత్త చిత్రం లుక్

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి హీరో చైతు లుక్ విడుదలైంది.

చరిత్ర సృష్టించిన కుర్రాడు.. 21 ఏళ్లకే న్యాయమూర్తి పదవి

ఎలిమెంటరీ విద్య ప్రారంభమైనప్పుడు విద్యార్థులు.. నేను కలెక్టరవుతా.. నేను ఇంజనీరవుతా.. అని చెప్పుకుంటూ ఉంటారు.