హీరో శర్వానంద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డైరెక్టర్...
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్ నటించిన రాజాధిరాజా చిత్రం ఇటీవల రిలీజైంది. చేరన్ రూపొందించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ...కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవల రాజాధిరాజా రిలీజైంది. అయితే...శర్వానంద్ కి ఈ చిత్ర నిర్మాత ఎమౌంట్ ఇవ్వాలట. కానీ..ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కి శర్వానంద్ సహకరించడం లేదు. ఇదిలా ఉంటే....తమిళ దర్శకుడు చేరన్ చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి శర్వానంద్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
శర్వానంద్... నువ్వు మంచి నటుడివే..అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నిన్ను నమ్మి కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతని ఇబ్బంది పెట్టడం సంస్కారం కాదు. డబ్బు కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం దురదృష్టకరం అంటూ తమిళ దర్శకుడు చేరన్ ఆగ్రహాన్ని, ఆవేదనని వ్యక్తం చేసారు. అంతే కాకుండా...శర్వానంద్ ఈ చిత్రం పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే నిర్మాత రవికిషోర్ కూడా ఈ సినిమా పై దుష్ర్పచారం చేస్తున్నారని తెలియచేసారు. కోటి రూపాయల పారితోషకానికి 55 లక్షలు ఇచ్చాం. ఇంకా 45 లక్షలు ఇవ్వాలి. ప్రమోషన్స్ కి ఏమాత్రం సహకరించడం లేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా, మెసెజ్ పెట్టినా స్పందిచడం లేదు. డబ్బులు ఇవ్వమని మేము ఎప్పుడూ అనలేదు. అయినా ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ తన ఆవేదనను తెలియచేసారు. మరి..చేరన్ పై శర్వానంద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments