తమిళ అర్జున్ రెడ్డి.. దర్శకుడు, హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన అర్జున్‌రెడ్డి తెలుగునాట సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు దక్షిణాదిన తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో రీమేక్‌లో రణవీర్ నటిస్తాడని అంటున్నారు.
కాగా తమిళ రీమేక్ విషయానికి వస్తే హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను అసలు ఎవరు డైరెక్ట్ చేస్తారోనని ఆసక్తి నెలకొంది అయితే చివరకు సినిమాను దర్శకుడు బాల తెరకెక్కించనున్నాడని సమాచారం.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు చేస్తారు? అని చూస్తే..ఇద్దరు హీరోయిన్స్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అక్షర హాసన్ లేదా శియా శర్మ(నువ్వు నేను ప్రేమలో చిన్నపాపగా కనిపించింది) పేర్లు వినపడుతున్నాయి. మరి ఇద్దరిలో ఎవరు పైనలైజ్ అవుతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments