రజనీకాంత్ సినిమాలో నటిస్తున్న దర్శకుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడుగా సినీ అభిమానులకు పరిచయమైన సముద్ర ఖని తర్వాత ఎన్నో సినిమాల్లో నటుడిగా కూడా మెప్పించాడు. తన నటనతో జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు సముద్ర ఖని సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని పా రంజిత్ కోలీవుడ్ వర్గాలకు తెలియజేశాడట.
ఈ నెల 28నుండి చెన్నైలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబై దారావి సెట్లో చెన్నైలో వేస్తున్నారు. హీరో, నిర్మాత అయిన ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేష్ హీరోయిన్గా నటిస్తుంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments