'ఎన్.జి.కె' టైటిల్ గురించి దర్శకుడు ఏమన్నారంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా (సూర్య 36) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు కాగా.. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం సూర్య, సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. ఇదిలా వుంటే.. సెల్వరాఘవన్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ విడుదల చేశారు. టైటిల్ ఎన్.జి.కె` అని పెట్టడంతో.. దాని అర్థం ఏమై ఉంటుందోనని సూర్య అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
దీనికి సెల్వరాఘవన్ స్పందిస్తూ.. ఈ చిత్రంలో సూర్య పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ఈ టైటిల్ లోనే సూర్య పేరు దాగి ఉందని.. అదేంటో చెపితే థ్రిల్ ఉండదని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా, సూర్య ఓ ఛాలెంజింగ్ పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఇంతకన్నా ఏం చెప్పినా సినిమా గురించి మొత్తం చెప్పినట్టే అవుతుందని ముక్తాయించారు. ఇదిలా వుంటే.. ఎన్.జి.కె` అంటే (నాట్ గుడ్, కైండ్) అనే కొత్త అర్ధం చెబుతున్నారు సూర్య అభిమానులు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ప్రకాష్ బాబు, ఎస్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout