అనుపమ ఎంట్రీ సీన్ అదిరందంటున్న దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
‘తొలిప్రేమ’.. సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు ఎ.కరుణాకరన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను యూత్ ఐకాన్‌గా నిలబెడుతూ.. పవన్‌కు తొలి బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడంలో ఎంత శ్రధ్ధ చూపిస్తారో.. తన సినిమాల్లో కథానాయికలకు వారి ఎంట్రీ దగ్గర నుంచి, వారి పాత్ర తీరుతెన్నుల వరకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ దర్శకుడు.
‘తొలిప్రేమ’.. కరుణాకరన్.. ఈ పేర్లు వినగానే.. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి రెడ్డి ఎంట్రీ సీన్ గుర్తుకు రాక మానదు. కీర్తిని వైట్ డ్రెస్‌లో ఒక ఏంజెల్‌గా ప్రెజెంట్ చేసిన విధానం అప్పట్లో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో మాత్రమే కాదు.. తన ప్రతీ చిత్రంలోనూ హీరోయిన్ ఎంట్రీ సన్నివేశం కోసం ప్రత్యేక శ్రధ్ధ చూపిస్తూ ఉంటారు ఈ యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్.
ఇదిలా ఉంటే.. తాజాగా మెగాహీరో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమాను తెరకెక్కించిన కరుణాకరన్.. ఈ మూవీలో కూడా అనుపమ ఎంట్రీ సీన్ చాలా బాగా వచ్చిందని ప్రీ-రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు. అంతేగాకుండా.. ఆమె ఈ సినిమాలో అద్భుతంగా నటించిందని కూడా కితాబిచ్చారు ఈ దర్శకుడు. ప్రస్తుతం విడుదలకు సిధ్ధంగా ఉన్న ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com