‘నాంది’ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళుతోన్న దిల్‌రాజు..

  • IndiaGlitz, [Thursday,February 25 2021]

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఉన్న అగ్ర నిర్మాత‌ల్లో దిల్‌రాజు ఒక‌డు. తెలుగులో అగ్ర క‌థానాయకుల‌తో సినిమాలే కాదు.. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ వైవిధ్య‌మైన కుటుంబ క‌థా చిత్రాల‌ను అందించ‌డంతో దిల్‌రాజు తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఓ ప్ర‌త్యేక‌స్థానం ఉంది. ఇప్పుడు దిల్‌రాజు స్టైల్ మార్చాడు. కేవ‌లం టాలీవుడ్‌కే ప‌రిమితం కావాల‌ని అనుకోవ‌డం లేదు. బాలీవుడ్‌లోకి జెర్సీ రీమేక్‌తో నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు.. ప్యాన్ ఇండియా నిర్మాత‌గా కూడా మారుతున్నాడు. రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న హై బ‌డ్జెట్ విజువ‌ల్ మూవీని దిల్‌రాజు నిర్మించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. బాలీవుడ్‌లోకి ఇప్ప‌టికే జెర్సీ రీమేక్‌తో ఎంట్రీ ఇచ్చిన దిల్‌రాజు ఇప్పుడు మ‌రో టాలీవుడ్ సినిమాను బాలీవుడ్‌లోకి రీమేక్ చేయ‌బోతున్నాడ‌ట‌.

ఇంత‌కీ దిల్‌రాజు బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్న సినిమా ఏదో కాదు.. నాంది. రీసెంట్‌గా ఈ సినిమా విడుద‌లైంది. కామెడీ రోల్స్ ఎక్కువ‌గా చేసే అల్ల‌రి న‌రేష్, రూట్ మార్చి నాంది సినిమాలో న‌టించాడు. ఈ సినిమా చాలా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. దీంతో నిర్మాత దిల్‌రాజు ఈ సినిమా హిందీ హ‌క్కుల‌ను కొనుగోలు చేశాడు. దీన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. మరికొన్ని రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది.

More News

న్యూడ్ ఫొటో అడిగిన ఫ్యాన్‌.. షాకిచ్చిన శ్రీముఖి

టాలీవుడ్‌లో స్టార్ యాంక‌ర్స్‌లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి బుల్లితెర‌పై బిజి బిజీగా ఉంటోంది.

కోలు కోల‌మ్మా.. అంటోన్న సాయిప‌ల్ల‌వి

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన త‌మిళ పొన్ను సాయిప‌ల్ల‌వి తన‌దైన శైలిలో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తుంది.

'లౌక్యం' సక్సెస్ తర్వాత ఆనందప్రసాద్ గారు ఐఫోన్ లు ఇచ్చారు. 'చెక్'కి అంతకంటే పెద్దగిఫ్ట్ అడగాలి! - సంపత్ రాజ్

సంపత్ రాజ్... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్

పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో కళా దర్శకునిగా 'ఆనంద్ సాయి'

కళా దర్శకుడు 'ఆనంద్ సాయి' పరిచయం వాక్యాలు అవసరం లేని,లబ్ధ ప్రతిష్ఠుడైన కళా దర్శకుడు ఆయన..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'

ప‌వ‌న్ ట్రీట్ రెడీ అవుతోంది..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం హైదరాబాద్‌లో చ‌క చ‌కా జ‌రుగుతోంది.