‘నాంది’ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళుతోన్న దిల్‌రాజు..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు ఒకడు. తెలుగులో అగ్ర కథానాయకులతో సినిమాలే కాదు.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాలను అందించడంతో దిల్‌రాజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఇప్పుడు దిల్‌రాజు స్టైల్ మార్చాడు. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కావాలని అనుకోవడం లేదు. బాలీవుడ్‌లోకి జెర్సీ రీమేక్‌తో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు.. ప్యాన్ ఇండియా నిర్మాతగా కూడా మారుతున్నాడు. రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న హై బడ్జెట్ విజువల్ మూవీని దిల్‌రాజు నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. కాగా.. బాలీవుడ్‌లోకి ఇప్పటికే జెర్సీ రీమేక్‌తో ఎంట్రీ ఇచ్చిన దిల్‌రాజు ఇప్పుడు మరో టాలీవుడ్ సినిమాను బాలీవుడ్‌లోకి రీమేక్ చేయబోతున్నాడట.
ఇంతకీ దిల్‌రాజు బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్న సినిమా ఏదో కాదు.. నాంది. రీసెంట్గా ఈ సినిమా విడుదలైంది. కామెడీ రోల్స్ ఎక్కువగా చేసే అల్లరి నరేష్, రూట్ మార్చి నాంది సినిమాలో నటించాడు. ఈ సినిమా చాలా మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో నిర్మాత దిల్‌రాజు ఈ సినిమా హిందీ హక్కులను కొనుగోలు చేశాడు. దీన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తాడని సినీ వర్గాల సమాచారం. మరికొన్ని రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments