అనాథ పిల్లలను దత్తత తీసుకున్న దిల్‌రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు తన సహృదయతను చాటుకున్నారు. అనాథలైన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. భర్తపై బెంగతో భార్య అనురాధ కూడా రెండు రోజుల క్రితం కన్నుమూశారు. తల్లిదండ్రుల మరణంతో పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్ అనాథలయ్యారు. ఈ విషయాన్ని ఓ ఛానెల్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, సదరు గ్రామ సర్పంచు, ఎమ్మెల్యేతో ఫోన్‌లో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి కోరారు. మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు దిల్‌రాజు. అడగ్గానే అనాథ పిల్లలను దత్తత తీసుకున్న నిర్మాత దిల్ రాజుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. తన కుటుంబం స్థాపించిన ‘మా పల్లె’ చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లలను బాగోగులును చూసుకుంటానని దిల్‌రాజు ఈ సందర్భంగా తెలియజేశారు. మా పల్లె ట్రస్టు ద్వారా పలు సహాయ కార్యక్రమాలను దిల్‌రాజు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు అదే ట్రస్టు ద్వారా అనాథ పిల్లల బాగోగులను చూసుకోనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments