అనాథ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్న దిల్‌రాజు

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

తెలుగు అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు. అనాథ‌లైన ముగ్గురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. యాదాద్రి జిల్లా ఆత్మ‌కూరు గ్రామంలో గ‌ట్టు స‌త్త‌య్య ఏడాది క్రితం అనారోగ్యంతో క‌న్నుమూశారు. భ‌ర్త‌పై బెంగ‌తో భార్య అనురాధ కూడా రెండు రోజుల క్రితం క‌న్నుమూశారు. త‌ల్లిదండ్రుల మ‌ర‌ణంతో పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్‌ అనాథ‌ల‌య్యారు. ఈ విష‌యాన్ని ఓ ఛానెల్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు, స‌ద‌రు గ్రామ స‌ర్పంచు, ఎమ్మెల్యేతో ఫోన్‌లో ప్ర‌త్యేకంగా మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు.

ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి కోరారు. మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు దిల్‌రాజు. అడ‌గ్గానే అనాథ‌ పిల్లలను దత్తత తీసుకున్న నిర్మాత దిల్ రాజుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. త‌న కుటుంబం స్థాపించిన ‘మా ప‌ల్లె’ చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా పిల్ల‌ల‌ను బాగోగులును చూసుకుంటాన‌ని దిల్‌రాజు ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. మా ప‌ల్లె ట్ర‌స్టు ద్వారా ప‌లు స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను దిల్‌రాజు నిర్వ‌హిస్తుంటారు. ఇప్పుడు అదే ట్ర‌స్టు ద్వారా అనాథ పిల్ల‌ల బాగోగుల‌ను చూసుకోనున్నారు.

More News

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!..ఇది అక్కినేని నాగార్జున అభిమానుల‌కే కాదు.. సినీ ప్రియుల‌లంద‌రికీ శుభ‌వార్తే.

అల్లు అర్జున్ 21... పాయింట్ అదేనా?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ త‌న కెరీర్‌ను చాలా చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతి

ఏపీ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు(60) కరోనాతో మృతి చెందారు.

విశాఖ హిందూస్థాన్‌లో ప్రమాదం.. 11 మంది మృతి

విశాఖలో మరో ప్రమాదం సాగర వాసులను భయాందోళనలకు గురి చేసింది.

కరోనా వ్యాక్సిన్ విషయమై గుడ్ న్యూస్ చెప్పిన నిమ్స్ వైద్యుడు

భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే.