close
Choose your channels

జూలై 20న విడుద‌ల‌వుతున్న 'ల‌వ‌ర్‌' చిత్రం పెద్ద స‌క్సెస్ అవుతుంది - దిల్‌రాజు

Sunday, July 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జూలై 20న విడుద‌ల‌వుతున్న ల‌వ‌ర్‌ చిత్రం పెద్ద స‌క్సెస్ అవుతుంది - దిల్‌రాజు

రాజ్ త‌రుణ్‌, రిద్ధికుమార్ జంట‌గా న‌టించిన చిత్రం `ల‌వ‌ర్‌`. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ ఈ సినిమాను నిర్మించారు. జూలై 20న సినిమా విడుద‌ల‌వుతుంది. శ‌నివారం హైద‌రాబాద్ ఐ మ్యాక్స్‌లో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. సినిమాకు సంగీతం అందించిన సంగీత ద‌ర్శ‌కులు అంకిత్ తివారి, తనీశ్‌, అంకిత్ తివారి, సాయికార్తీక్, జె.బి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా...హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - "15 సంవ‌త్స‌రాల్లో 27 (గ‌త ఏడాదితో) సినిమాలు చేశాం. అందులో 22 సినిమాలు సక్సెస్‌ఫుల్ అయ్యాయి. 5 వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఇది మా బ్యాన‌ర్‌లో 28వ సినిమా. ఇందులో చిన్న సినిమాలుగా చూస్తే ఇది మూడో సినిమా. కేరింత త‌ర్వాత మ‌రో చిన్న సినిమా ఇది. హ‌ర్షిత్ చేస్తానంటే.. అనీశ్ చెప్పిన క‌థ‌తో మొద‌లైన సినిమా ఇది. లుక్‌, టీజ‌ర్‌, సాంగ్స్ బావున్నాయని అంటున్నారు.

ఈరోజు విడుద‌ల చేసిన ట్రైల‌ర్ కూడా బావుంద‌ని అంటున్నారు. చిన్న సినిమాగా విడుద‌ల‌వ‌తున్న ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ అవుతుంద‌నే న‌మ్ముతున్నాం. మేం ఎంత క‌ష్ట‌పడ్డా చివ‌రికి అది ప్రేక్ష‌కుడికి న‌చ్చాలి. అప్పుడే మా అంద‌రికీ ప్ర‌యోజ‌నం. మా ల‌వ‌ర్ స‌క్సెస్ సాధించి మా అంద‌రికీ ప్ర‌యోజ‌నం దొరుకుతుంద‌ని భావిస్తున్నాను.

నిర్మాత‌గా హ‌ర్షిత్ తొలి సినిమా ఇది. నా తొలి సినిమాకు కూడా నెర్వ‌స్ ఫీల్ కాలేదు .. కానీ ఈ సినిమా కాస్త నెర్వ‌స్‌గా ఫీల్ అవుతున్నాను. నేను చేయ‌డానికి, వెన‌కుండి చేయించ‌డానికి చాలా తేడా ఉంది. చాలా క‌ష్ట‌మైన ప‌ని కూడా. ఎందుకంటే మ‌న‌కి కొన్ని న‌చ్చుతాయి.

వాళ్లికి వేరే న‌చ్చుతాయి. వాళ్లే క‌రెక్ట్ అని అంటుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత ట‌ఫ్ జాబ్ డైరెక్ట‌ర్స్‌తో ఫేస్ చేశాను. ఈసారి హ‌ర్షిత్‌తో ఫేస్ చేశాను. అందరూ హార్డ్ వ‌ర్క్ చేసి అద్భుత‌మైన అవుట్‌పుట్ ఇచ్చారు. ఈ నెల 20న ల‌వ‌ర్ విడుద‌లై స‌క్సెస్‌ఫుల్ సినిమా అవుతుంద‌ని న‌మ్ముతున్నాను" అన్నారు.

చిత్ర నిర్మాత హ‌ర్షిత్ రెడ్డి మాట్లాడుతూ - "సోలో నిర్మాత‌గా నా తొలి చిత్రం ల‌వ‌ర్‌. మా బాబాయ్ వాళ్ళ స‌పోర్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా కోసం బాబాయ్‌లు ఇన్‌వెస్ట్ చేయ‌డం గ్రేట్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ విష‌యానికి వ‌స్తే రాజుగారు ఇండియ‌న్ 2 సినిమాను అనౌన్స్ చేసి ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారి సంగీతం చేస్తున్నార‌ని చెప్ప‌గానే.. అది చూసి ఒప్పుకున్నారు. అలాగే ఆర్కోగారు ఓ పంజాబీ పాట‌ను చేశారు. అది విన్న స‌మీర్ రెడ్డిగారు దిల్‌రాజు స‌హా అంద‌రినీ ఒప్పించి ఈ ఆల్బమ్‌లో వ‌చ్చేలా చూసుకున్నారు.

తనీశ్‌గారు వ‌రుస‌గా రెండు, మూడు ఏళ్ల పాటు వ‌రుస హిట్ సినిమాల‌కు సంగీతం అందించిన వ్య‌క్తి. ఆయ‌న ద‌క్షిణాది సినిమాకు సంగీతం చేయాల‌నుకుంటున్న త‌రుణంలో నేను ఆయ‌న్ను క‌లిశాను. ఆయ‌న వెంట‌నే ఒప్పుకున్నారు. మెలోడీ చేయాల‌నే కోరిక‌తో సాయికార్తీక్‌గారు.. అడిగి మ‌రీ చేశారు. జె.బిగారు బాహుబ‌లి వంటి సినిమాల‌కు కీర‌వాణిగారి వెనుక నిల‌బ‌డ్డారు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌గారు ప్ర‌తి సినిమాకు బెస్ట్ ఇస్తారు. ఈ సినిమాకు ఇంకా బెస్ట్ ఇచ్చారు. ప్ర‌వీణ్ పూడిగారు .. సినిమా చూసి కొన్ని సందేహ‌లు మొద‌ల‌య్యాయి. అలా స్క్రీన్‌ప్లే మొద‌లైంది. అలా నెమ్మ‌దిగా అంద‌రూ టెక్నిక‌ల్‌గా ఎంతో స‌పోర్ట్ చేశారు. రాజ్‌త‌రుణ్ చాలా కేర్ తీసుకుని సినిమా చేశాడు. అలాగే రిద్ధి కుమార్ తెలుగు నేర్చుకుని సినిమా చేసింది. అనీశ్ అన్న‌తో మంచి ర్యాపో కుదిరింది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌" అన్నారు.

డైరెక్ట‌ర్ అనీశ్ కృష్ణ మాట్లాడుతూ "ముందుగా మా నాన్న‌గారికి థాంక్స్‌. ఎందుకంటే ఆయ‌న అందించిన స‌పోర్ట్ కార‌ణంగానే నేను ఈరోజు ఈస్థాయిలో నిల‌బడి మాట్లాడుతున్నాను. అలా ఎలా సినిమాకు ఈ సినిమాకు మూడేళ్ల గ్యాప్ వ‌చ్చింది. ఈ గ్యాప్ విష‌యంగా నేను బాధ‌ప‌డ‌లేదు. అయితే సినిమాను ఇంకాస్త ముందు చేసి ఉంటే నాన్న‌గారు కూడా చూసి ఉండేవారు క‌దా! అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే.. ఈ సినిమా డ్రాఫ్టింగ్ స్టేజ్‌లో నాన్న‌గారితో సినిమా గురించి ఎక్కువ‌గా డిస్క‌స్ చేసేవాడిని.

ఆయ‌న ఈరోజు భౌతికంగా నాతో లేరు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే దిల్‌రాజుగారు ఎంత ప్యాష‌నేట్ ఫిలిమ్ మేక‌రో నేను కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక ఎంగ్జాంపుల్ చెబుతాను. `మేం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను అనంత‌పురంలో షూట్ చేస్తున్నాం. రాత్రి ప‌న్నెండు, ఒంటి గంట ప్రాంతంలో నేను, హ‌ర్షిత్ డిస్క‌స్ చేసుకుంటున్నాం. ఒక డౌట్ వ‌చ్చింది. దిల్‌రాజుగారికి ఈ సమ‌యంలో ఫోన్ చేస్తే బావుంటుందా? అని ఆలోచిస్తూనే కాల్ చేశాం. ఆయ‌న ప్ర‌తి సీన్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం చూసి సినిమా డైరెక్ట‌ర్ నాకే అలా గుర్తు లేదే అని సిగ్గుప‌డ్డాను.."అంత మంచి ప్యాష‌నేట్ వ్య‌క్తితో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. అలాగే హ‌ర్షిత్‌గారు నాకు అండ‌గా నిల‌బడ్డారు. చాలా కూల్‌గా అంద‌రికీ స‌పోర్ట్ అందించారు. ఎవ‌రికీ ఎలాంటి స‌మ‌స్యా లేకుండా చూసుకున్నారు.

స‌మీర్‌రెడ్డిగారు.. మేం విజువ‌లైజ్ చేసుకున్న దాన్ని రెండువంద‌ల శాతం పెంచారు. ఈ సినిమాలో ఇంత మంచి విజువ‌ల్స్ వ‌చ్చాయంటే స‌మీర్‌రెడ్డిగారే కార‌ణం. నా టీమ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. ప్ర‌తి ఒక్కరికీ థాంక్స్‌. ఈ బ్యాన‌ర్‌లో ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను" అన్నారు.

రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ -"జూలై 20న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమాను పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని భావిస్తున్నాను "అన్నారు.

రిద్దికుమార్ మాట్లాడుతూ - "చాలా సంతోషంగా ఉంది. నా డెబ్యూ మూవీ. తెలుగు నేర్చుకుంటున్నాను. ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రూ వారి విభాగాల్లో మాస్ట‌ర్స్‌. అలాగే మంచి వ్య‌క్తులు. అనీశ్ కృష్ణ‌, దిల్‌రాజుగారు, హ‌ర్షిత్ రెడ్డిగారికి థాంక్స్‌ "అన్నారు.

సాయికార్తీక్ మాట్లాడుతూ - "ఆల్ రెడీ సినిమాలో పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు. అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్‌" అన్నారు.

రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ -"పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. జూలై 20న విడుద‌ల‌వ‌తున్న ఈ సినిమా కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. రాజ్‌త‌రుణ్‌కి ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నాను. దిల్‌రాజుగారికి థాంక్స్‌. హ‌ర్షిత్ ప‌డ్డ క‌ష్టానికి ప్రేక్ష‌కులు అత్య‌ద్భుత‌మైన ఫ‌లితాన్ని ఇవ్వ‌బోతున్నారు" అన్నారు.

అంకిత్ తివారి మాట్లాడుతూ - "తెలుగులో నా డెబ్యూ మూవీ. ఇందులో రెండు పాట‌లు కంపోజ్ చేశాను. స‌పోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కి థాంక్స్ చెబుతున్నాను "అన్నారు.

ఆర్కో మాట్లాడుతూ - "తెలుగులో తొలి సినిమా. విజువ‌ల్స్ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. అనీశ్ కృష్ణ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. దిల్‌రాజుగారికి, హీరో, హీరోయిన్ స‌హా టీమ్‌కి అభినంద‌న‌లు"అన్నారు.

స‌మీర్ రెడ్డి మాట్లాడుతూ -"ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌" అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment