'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' రిలీజ్‌పై సర్వత్రా ఉత్కంఠ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఎల్లుండి అనగా.. నవంబర్ 29న రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పినప్పటికీ.. విడుదలపై మాత్రం అనేక అనుమానాలు వస్తున్నాయి. అసలు రిలీజ్ అవుతుందా..? కాదా..? అని ఆర్జీవీ అభిమానులు, ఔత్సాహికుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాలో తనను అవమానపరిచారని.. అగౌరవపరిచేలా పాత్రను చిత్రీకరించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌తో పాటు మరోవైపు ఇంద్రసేన చౌదరి వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ కోర్టు విచారించింది.
రేపటికి వాయిదా..!
సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టకు సమర్పించాలని నిర్మాతలను హైకోర్టు ఆదేశించింది. అయితే.. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. ఈ విషయాన్ని నిర్మాతలు కోర్టుకు తెలపగా.. సినిమాకు సంబంధించిన రివ్యూను గురువారం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇంద్రసేన ఏమంటున్నారు..!?
‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా రిలీజ్ కాకూడదు. రిలీజ్ చేయకూడదనే నేను కోర్టును ఆశ్రయించాను. కమ్మ, రెడ్డి కులస్తుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయని కోర్టుకు పిటిషన్‌లో తెలిపాను’ అని ఇంద్రసేన చెప్పుకొచ్చారు. కాగా.. ఒకే ఒక్కరోజు సినిమా రిలీజ్‌కు గ్యాప్ ఉండటంతో అసలు థియేటర్లలోకి వస్తుందో లేదో అని ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసిన.. వీరాభిమనులు, ఔత్సాహికుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆర్జీవీ మాత్రం తప్పకుండా అనుకున్న టైమ్‌కే సినిమా రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు. మరి హైకోర్టు ఎలా తీర్పునిస్తుందో..? తెలియాలంటే గురువారం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com