తేజగారితో పనిచేశాక మరెక్కడా నేర్చుకోవాల్సిన పనిలేదు - దిలీప్

  • IndiaGlitz, [Wednesday,July 05 2017]

దిలీప్‌, ఈషా, దీక్షాపంత్‌ ప్రధాన పాత్రథారులుగా రూపొందిన చిత్రం 'మాయామాల్‌'. గోవింద్‌ లాలం దర్శకుడు. కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ళ, నల్లం శ్రీనివాస్‌ నిర్మాతలు. సినిమా జూలై 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో దిలీప్‌ మీడియాతో సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు.
దిలీప్‌ మాట్లాడుతూ ...
తేజ‌గారు ఒక స్కూల్‌..
నా తొలి చిత్రం దర్శకుడు తేజగారి దర్శకత్వంలో 'హోరా హోరీ' సినిమా చేశాను. ఆయ‌నొక పెద్ద స్కూల్‌. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేశాక‌, మ‌రెక్క‌డా నేర్చుకునే ప‌ని ఉండ‌దు. ఇక హోరాహోరీ త‌ర్వాత హీరోగా 'మాయా మాల్‌ నా రెండవ చిత్రం.
ద‌ర్శ‌కుడు గోవింద్ గురించి...
దర్శకుడు గోవింద్‌ లాలం దిల్‌రాజుగారి చీఫ్‌ అసోసియేట్‌గా వర్క్‌ చేశారు. తను సోలో, 'ఓ మై ఫ్రెండ్‌', 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలకు వర్క్‌ చేశారు. సినిమా పూర్త‌యిన త‌ర్వాత అవుట్‌పుట్ చూసుకున్నాను. చాలా హ్య‌పీగా అనిపించింది. ఆయ‌న చెప్పిన దాని కంటే చాలా బాగా తెర‌కెక్కించారు. గోవింద్‌ దర్శకుడవుదామని ఈ కథను తయారు చేసుకుని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓసారి నన్ను కలిసి ఈ కథను చెప్పాడు. కథ వినగానే నేను థ్రిల్‌ ఫీలయ్యాను. ముందు ఈ కథకు బిగ్‌ బజార్‌ అనే టైటిల్‌ను అనుకున్నాం కానీ, తర్వాత ఏదైనా సమస్య వస్తుందని మాయామాల్‌ అనే టైటిల్‌ పెట్టాం. సినిమాలో దెయ్యం ఉంటుంది కానీ, ఓ గెటప్‌లో ఉంటుంది.
క్యారెక్ట‌ర్, క‌థ‌ గురించి...
ఈ సినిమాలో నేను సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ క్యారెక్టర్‌ చేశాను. వైజాగ్‌లో ఓ ఛేజింగ్‌ సీన్‌తో సినిమా స్టార్టవుతుంది. వైజాగ్‌ నుండి హైదరాబాద్‌ చేరుకున్న నేను, హీరోయిన్‌ కొన్ని కారణాలతో విలన్స్‌ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఓ మాల్‌లో దాక్కొంటాం. అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. మాలాగే కొన్ని క్యారెక్టర్స్‌ వేర్వేరు కారణాలతో ఆ మాల్‌లో ఉంటారు. ఈ అన్ని క్యారెక్టర్స్‌ మధ్య రాత్రి నుండి పొద్దున వరకు అంటే ఒక రాత్రిలో ఏం జరిగిందనేదే సినిమా. హారర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సినిమా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. సినిమాలో ఒక సాంగ్‌, రెండు ఫైట్స్‌ ఉంటాయి. ఇనార్బిట్‌, స్పెన్సర్‌, సినీ పొలిస్‌ మాల్స్‌లో చిత్రీకరణ జరిగింది.
తదుప‌రి చిత్రాలు గురించి...
ఇదే బ్యానర్‌లో మరో సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అలాగే మరో రెండు సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్‌లో ఉన్నాయి. 'మాయామాల్‌' అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. ఆడియెన్‌ చాలా అలర్ట్‌గా సినిమా చూస్తాడు. ఎక్కడా డిసప్పాయింట్‌ కారని కచ్చితంగా చెప్పగలను.

More News

ఇద్దరి నిర్ణయం..ఆరుగురి జీవితాలు.... చిత్ర దర్శకుడు నందు మల్లెల

సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం,డే డ్రీమ్స్ బ్యానర్పై అనిల్ మల్లెల,మహిమ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'.

పక్కింటి అబ్బాయి పాత్రలో ఆది

భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా నారా రోహిత్, సుధీర్బాబు, సందీప్కిషన్, ఆది హీరోలుగా రూపొందిన చిత్రం 'శమంతకమణి'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.

'రక్తం' కు అంతర్జాతీయ అవార్డు రావడం ఓ గ్రేట్ థింగ్: నటుడు బెనర్జీ

సీనియర్ నటుడు బెనర్జీ ప్రధాన పాత్ర లో రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన `రక్తం` చిత్రానికి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఇండీ గేదరింగ్ ఫారిన్ డ్రామా ఫీచర్స్ సెగ్మెంట్ లో (2017) అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

విజయపథంలో గువ్వ గోరింక తొలిపాట

తొలిపాటతోనే మా గువ్వ గోరింక చిత్రం అటు టాలీవుడ్లో..

'ఏజెంట్ భైరవ' తెలుగు ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్ ఎంటర్ టైనర్- నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్పై విజయ్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏజెంట్ భైరవ'.భరతన్ దర్శకుడు.