25 సం.లు పూర్తి చేసుకున్న దిలీప్ కుమార్ సళ్వాడి

  • IndiaGlitz, [Sunday,October 21 2018]

దిలీప్..బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం, బావగారు బాగున్నారా, అన్నయ్య, నుంచి జయం వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆ బాలుడు కాస్త కుర్రాడిగా మారి హీరోగా మారి తెలుగు మరియు తమిళం, మళయాళ బాషల్లో సినిమాలు చెస్తున్నాడు.

కాగా నటుడిగా 25 సం.లు పూర్తి చెసుకున్న దిలీప్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ దిక్సూచి చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలొ ఎస్.ఆర్.ఎస్. అసొసియేట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై తెరకెక్కతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకొని , నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.


ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు-దర్శకుడు దిలీప్ కుమార్ సల్వాడి మాట్లాడుతూ.. బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన నేను , ఈ ఏడాది నటుడిగా 25సం.లను పూర్తి చెసుకొవటం సంతోషంగా ఉంది. ఈ టైమ్ లొనె అటు హీరొగా, ఇటు దర్శకుడిగా కూడా దిక్సూచి సినిమాను చెస్తున్నాను.ఈ తరహా కథాంశంతో ఇప్పటివరకూ తెలుగులో సినిమా రాలేదు. మూడు జోనర్స్ మిక్సింగ్ గా రూపొందిన సినిమా ఇది. 1970 నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొటీన్ కి భిన్నంగా ఉండబోతోంది. ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. చిత్రీకరణ పూర్తయింది.‌నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.‌త్వరలొనె సినిమాను విడుదల చెస్తామన్నారు.

చాందిని, సుమన్, డాక్టర్ రజిత సాగర్, బిత్తిరి సత్తి, ఛత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, మల్లాది భాస్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రామరాజు, వి.ఎఫ్.ఎక్స్: కొత్తపల్లి ఆది, కో-డైరెక్టర్: ఎస్.నందకిషోర్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, లైన్ ప్రొడ్యూసర్: సైపు మురళి, పాటలు: శ్రీరామ్ తపస్వీ, ఎడిటింగ్: గ్యారీ బీ.హెచ్, కళ: పునురి ఎ.ఆనంద్, సంగీతం: పద్మనావ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: జయకృష్ణ కూనపరెడ్డి, నిర్మాతలు: శైలజా సముద్రాల-నరసింహరాజు రాచూరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దిలీప్ కుమార్ సల్వాడి

More News

'ఏడు చేపల కథ' ఫస్ట్ లుక్ విడుదల.. సూపర్బ్ రెస్పాన్స్

"మీటూ" ఉద్యమం దేశాన్ని ఉపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు "మీటూ" ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని

వీర భోగ వసంత రాయలు లో శ్రీవిష్ణు ఫస్ట్ లుక్..!!

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు '. ఈ చిత్రంలోని విష్ణు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

కాదంబరి ఆశ, శ్వాస మనం సైతం...

సాటి వారికి సేవ చేసే మనిషిలోనే దైవం ఉన్నాడని మనం సైతం సేవా కార్యక్రమాల ద్వారా కాదంబరి కిరణ్ నిరూపిస్తున్నారు.

వ‌ర్మ. పొగ పెట్టాడుగా!!

రామ్‌గోపాల్ వ‌ర్మ ఏం చేసినా..త‌న‌ పబ్లిసిటీ కోస‌మో, త‌న సినిమా ప‌బ్లిసిటీ కోస‌మో.. వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉండ‌టం కోస‌మో ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు.

బ‌న్ని.. త్రివిక్ర‌మ్ సినిమా రీమేకా?

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం త‌ర్వాత బ‌న్ని మ‌రో సినిమాను చేయ‌లేదు. కాస్త గ్యాప్ తీసుకున్నాడు. మ‌ధ్యలో చాలా క‌థ‌ల‌నే విన్నాడు.