దిలీప్ అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ మలయాళ నటి భావన అపహరణ, లైంగిక వేధింపులు కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌ను కేరళ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిభ్రవరిలో కొంతమంది గుర్తు తెలియని వక్తులు భావనను కారులో బలవంతగా ఎక్కించుకుని కిడ్నాప్‌కు ప్రయత్నించడమే కాకుండా, కారులో ఆమెను లైంగింకగా వేధించారు. దీనిపై భావన పోలీసులుకు పిర్యాదు చేసింది.
ఈ ఘటన సంచలనం క్రియేట్ చేయడంతో దేశం మొత్తం దీనిపై నిరసనను తెలియజేసింది. కేరళ నటీనటులందరూ భావనకు సపోర్ట్‌గా నిలిచారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న కీలక వ్యక్తి పల్సర్ సునీల్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. గతవారం పోలీసులు ఈ కేసుకు సంబంధించి పల్సర్ సునీల్‌కుమార్, దర్శకుడు నాదిర్‌షా, దిలీప్‌కుమార్‌ను విచారించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దిలీప్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com