దిలీప్ అరెస్ట్

  • IndiaGlitz, [Tuesday,July 11 2017]

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి భావ‌న అప‌హ‌ర‌ణ‌, లైంగిక వేధింపులు కేసులో ప్ర‌ముఖ న‌టుడు దిలీప్‌ను కేర‌ళ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిభ్ర‌వ‌రిలో కొంత‌మంది గుర్తు తెలియ‌ని వ‌క్తులు భావ‌నను కారులో బ‌ల‌వంత‌గా ఎక్కించుకుని కిడ్నాప్‌కు ప్ర‌య‌త్నించ‌డ‌మే కాకుండా, కారులో ఆమెను లైంగింక‌గా వేధించారు. దీనిపై భావ‌న పోలీసులుకు పిర్యాదు చేసింది.

ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌డంతో దేశం మొత్తం దీనిపై నిర‌స‌న‌ను తెలియ‌జేసింది. కేర‌ళ న‌టీన‌టులంద‌రూ భావ‌నకు స‌పోర్ట్‌గా నిలిచారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న కీల‌క వ్య‌క్తి ప‌ల్స‌ర్ సునీల్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. గ‌త‌వారం పోలీసులు ఈ కేసుకు సంబంధించి ప‌ల్స‌ర్ సునీల్‌కుమార్‌, ద‌ర్శ‌కుడు నాదిర్‌షా, దిలీప్‌కుమార్‌ను విచారించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు దిలీప్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.