హిట్ కాంబోతో దిల్ రాజు...
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత దిల్‌రాజు ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్‌తో సినిమా చేయబోతున్నాడని సమాచారం.
గతంలో నిఖిల్‌తో `కార్తికేయ`లాంటి సినిమా చేసిన చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. అయితే ప్రస్తుతం నిఖిల్ కిరిక్ పార్టీ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. అలాగే, చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే మళ్లీ ఈ హిట్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని సమాచారం.
దిల్‌రాజు కూడా నెక్ట్స్ మహేష్, వంశీ పైడిపల్లి సినిమా చేయబోతున్నాడు. అందరూ కమిట్మెంట్స్ పూర్తి కావాలంటే కచ్చితంగా ఏడాది సమయమైతే పడుతుంది. కాబట్టి ఈ సినిమా వచ్చే ఏడాదే సెట్స్‌పైకి వెళుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments