తెలుగు సినిమా స్థాయిని పెంచుదాం - దిల్ రాజు

  • IndiaGlitz, [Tuesday,June 27 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌రీష్ శంక‌ర్.ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా రూపొందిన చిత్రం 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. జూన్ 23న విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై 25వ చిత్రంగా రూపొందిన 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌' బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో వంద‌కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ దిశ‌గా సాగిపోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్, రావు ర‌మేష్‌, స‌మీర్‌, పూజా హెగ్డే, సినిమాటోగ్రాఫ‌ర్ అయానాక బోస్‌, ఛోటా కె.ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. సినిమా విజ‌యం సాధించినందుకు కేక్ క‌టింగ్ కూడా చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో...

వంద‌కోట్లు నెంబ‌ర్ కాదు..ప్రేక్ష‌కుల ప్రేమ‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - ''ఇది స‌క్సెస్ మీట్ కాదు, ఇది థాంక్యూ మీట్‌. ఈ స‌క్సెస్‌తో మ‌మ్మ‌ల్ని దీవించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. న‌న్ను స‌పోర్ట్ చేస్తున్న మెగాభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. సినిమాటోగ్రాఫ‌ర్ అద్భుత‌మైన పిక్చ‌రైజేష‌న్‌, దేవిశ్రీ ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, పోసాని ఇలా అందరికీ థాంక్స్‌. అలాగే సాహిత్యం అందించిన‌వారికి థాంక్స్‌. స‌క్సెస్‌లో భాగ‌మైన పూజా హెగ్డేకు థాంక్స్‌. ఓ సినిమాలో ప‌నిచేసే ఇంత మందికి స‌క్సెస్ ఇచ్చే ఏకైక వ్య‌క్తి డైరెక్ట‌ర్ మాత్ర‌మే. అలాంటి స‌క్సెస్ ఇచ్చిన డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌గారికి మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్‌. మీరు మాట్లాడటం కంటే మీ సినిమా ఎక్కువ మాట్లాడుతుంది. కొంత నెగ‌టివిటి ఉంది.అయితే నా పాజిటివిటీతో నెగిటివిటీని దాటుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను. దిల్‌రాజుగారు, నా కాంబినేష‌న్‌లో ఇది హ్యాట్రిక్ మూవీ. ఈ సినిమా దిల్‌రాజుగారి కోస‌మే ఆడాల‌ని నేను ఆడియో ఫంక్ష‌న్ రోజునే చెప్పాను. దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో ఈ సినిమా వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ కావ‌డానికి కార‌ణం ప్రేక్ష‌కులే. రాజుగారి బ్యాన‌ర్‌లో అల్ట్రా మాస్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. క‌లెక్ష‌న్ అనేది ఒక నంబ‌ర్ కాదు. ఎంత మంది చూశారు. ఎంత‌మందిపై ఇంపాక్ట్ ఉంద‌నేదే. వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ అని చెప్ప‌గ‌ల‌ను. అంద‌రికీ థాంక్స్‌. మా సినిమా చాలా మంది ఎన్నారైల‌కు న‌చ్చింది. కాబ‌ట్టి యూనిట్ అంతా అమెరికాకు వెళ్లి వారంద‌రినీ క‌లుస్తాం'' అన్నారు.

మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే..100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''బ‌న్ని న‌న్ను ఎప్పుడు మా బ్యాన‌ర్‌లో మాస్ సినిమా తీయ‌లేన‌ని ఆట ప‌ట్టిస్తుండేవాడు. కానీ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా బ‌న్ని కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాసర్‌గా నిలిచింది. 4 రోజుల్లో 75 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసి ఒక వారంలో వంద కోట్ల క‌లెక్ట్ చేయ‌నుంది. ఇంపాజిబుల్ అనేది నీ వ‌ల్లే పాజిబుల్ అయ్యింది. అలాగే ద‌ర్శ‌కుడు హ‌రీష్ ఎప్పుడూ అన్న నీ బ్యాన‌ర్‌లో హయ్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ సాధించే సినిమా నేను చేయాల‌నుంది అనేవాడు. త‌న కోరిక తీరింది. బ‌న్ని, హ‌రీష్ కోరిక తీరింది. 2015లో హ‌రీష్ ఓ ఐడియా చెబితే బావుంద‌ని నేను బ‌న్నికి చెప్పాను. స్క్రిప్ట్ రెడీ చేసిన త‌ర్వాత సినిమా ఓకే అయ్యింది. సినిమా కోసం హ‌రీష్ 21 నెల‌లు క‌ష్ట‌ప‌డ్డాడు. ఒక స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా ఉండి దాదాపు రెండు సంవత్స‌రాలు హ‌రీష్ ఈ సినిమా స‌క్సెస్ కోసం క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ క‌ష్ట‌మేంటో నాకు, బ‌న్నికి తెలుసు. క్యారెక్ట‌ర్ అనుకున్న త‌ర్వాత నుండి బ‌న్ని ఏడాది పాటు బ్రాహ్మ‌ణ‌త్వం ఎలా ఉండాలి. డీజే క్యారెక్ట‌ర్ ఎంత స్ట‌యిలిష్‌గా ఉండాల‌ని వ‌ర్క్ చేసుకుంటూ వ‌చ్చాడు. ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌తి సెక‌న్ ఇన్వాల్వ్‌మెంట్‌, పిల్ల‌ర్స్‌లా బ‌న్ని, హ‌రీష్ క‌ష్ట‌ప‌డ్డారు. ప్ర‌తి ద‌ర్శ‌కుడు, హీరో ఒక సంవ‌త్స‌రం నుండి ఏడాదిన్న‌ర పాటు వాళ్ల ర‌క్తం ధార‌పోసి ప‌నిచేస్తారు. జూన్ 23న సినిమా రిలీజైన త‌ర్వాత అమెరికా నుండి ఉద‌యం మూడున్న‌రకు ఫోన్ చేసి ఫ‌స్టాఫ్ బావుంది. సెకండాఫ్ అలా అలా ఉంది. క్లైమాక్స్ బావుంద‌ని ఫోన్ చేశారు. నేను హ్యాపీగా ఫీల‌య్యాను. నెల్లూరు నుండి సెకండాఫ్ బావుంద‌ని అన్నారు. ఇలా యూనానిమ‌స్ టాక్ వ‌చ్చింది. మార్నింగ్ షో నుండి వ‌చ్చిన డివైడ్ టాక్ నుండి ఫ‌స్ట్ షో కు టాక్ మారిపోయింది. మేం అనుకున్న‌ట్లు సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా తొలి వారంలోనే 100 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిందంటే ఇంత‌కు మించి సమాధానం ఏమీ లేదు. ఈరోజు సోష‌ల్ మీడియాలో మన‌ల్ని మ‌నం త‌క్కువ చేసుకుంటున్నారు. కానీ బాలీవుడ్‌వాళ్ళు డీజే సినిమా చూసి బాలీవుడ్‌వాళ్లు సినిమాలు తీయాల‌నేలా ట్వీట్స్ చేస్తున్నారు. ప్ర‌తి ఒక హీరో సినిమా బాగా ఆడాలి. ప్ర‌తి సినిమా ఒక‌దానిపై ఒక‌టి గ్రాస‌ర్ పెర‌గాలి. దాని వ‌ల్ల తెలుగు సినిమా స్టాండ‌ర్డ్ పెర‌గాలి. ఏ హీరో అభిమానులు మ‌రో హీరోను త‌క్కువ చేసుకోవ‌ద్దు. మ‌నం తెలుగువాళ్ళం. మన సినిమా స్టాండ‌ర్డ్‌ను పెంచండి. ఇదే నేను చేసే రిక్వెస్ట్‌''అన్నారు.

మంచి సినిమాల‌కు రెవెన్యూలే త‌ప్ప రివ్యూలు క‌న‌ప‌డ‌వ‌ని నిరూపించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌

హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ - ''మేం ఊహించిన విజ‌యాన్ని మూడు రోజుల్లోనే మాకు అందించిన ప్రేక్ష‌క దేవుళ్ళంద‌రికీ సాష్టాంగ న‌మ‌స్కారం. సినిమా పాయింట్ 2015లో పుట్టింది. కానీ దాని కంటే ముందు హీరో న‌న్ను పిలిచి హ‌రీష్ నేను నీతో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయిపోయా, చేసే సినిమా మ‌న ఇద్ద‌రి కెరీర్‌లో నెక్ట్స్‌లెవ‌ల్‌కు తీసుకెళ్ళాలి. నీ సినిమాలు చూశాను. ఎంట‌ర్‌టైన్మెంట్ బాగా తీస్తావు. నాకు చాలా ఇష్టం. మ‌న ఇద్ద‌రి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మ‌న కాంబినేష‌న్‌లో రావాలి. నువ్వు ఎప్పుడు చేద్దామ‌న్నా నేను రెడీ అన్నాడు. పాయింట్ కూడా విన‌కుండా బ‌న్ని న‌న్ను న‌మ్మి అంత పెద్ద బాధ్య‌త‌ను నాపై ఉంచినందుకు బ‌న్నికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను.బ్రాహ్మ‌ణుడైనా నాకు పురుష సూక్తం నేర్చుకోవ‌డానికి ఏడాది స‌మ‌యం ప‌డితే బ‌న్ని కేవ‌లం రెండు నెల‌ల్లో నేర్చుకున్నాడంటే బ‌న్ని ఎంత డేడికేష‌న్‌తో వ‌ర్క్ చేశారో అర్థం చేసుకోవ‌చ్చు. సోష‌ల్ మీడియాలో లేని పోని కంపేరిజ‌న్స్ ఎందుకు. అప్ప‌ట్లో డా.రాజ‌శేఖ‌ర్ చేసిన అంకుశం సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యింది. అంకుశం వ‌చ్చింది క‌దా అని గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా ఆగ‌లేదు. గ‌బ్బ‌ర్ సింగ్‌లో హీరో పోలీస్ క్యారెక్ట‌ర్ క‌దా అని మొన్న వ‌చ్చిన ప‌టాస్ ఆగ‌లేదు. ప‌టాస్ వ‌చ్చింది క‌దాని రాధ ఆగ‌లేదు. ఎంత మంది హీరోలు కాలేజ్ స్టూడెంట్‌గా, ఆటోడ్రైవ‌ర్స్‌గా ఇలా ఎన్నో క్యారెక్ట‌ర్స్ ఎంతో మంది చేసుంటారు. బ్రాహ్మ‌ణ క్యారెక్ట‌ర్ అనేది చాలా త‌క్కువ సినిమాల్లో వ‌చ్చింది. మైకేల్ మ‌ద‌న కామ‌రాజులో క‌మ‌ల్ హాస‌న్‌గారు, ముగ్గురు మొన‌గాళ్ళులో చిరంజీవిగారు, అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్‌గారు ఇలా త‌క్కువ సినిమాల్లో రావ‌డం వ‌ల్ల కంపేరిజ‌న్ వ‌చ్చి ఉండొచ్చు. మొన్న ఈ సినిమా ఇంట‌ర్వ్యూలో 'మీ సినిమా విడుద‌లైతే హీరోల మ‌ధ్య తేడాలు బ‌య‌ట‌కు వ‌స్తాయేమో' అనే క్వ‌శ్చ‌న్ చేశారు. నేను చెప్పెదొక్క‌టే నేను హీరో వ‌ర్షిప్ నుండే ద‌ర్శ‌కుడిగా మారాను. నేను హైద‌రాబాద్‌లో చ‌దువుకునే రోజుల్లో హీరోల క‌టౌట్స్‌కు పాలాభిషేకం, హీరో క‌టౌట్స్‌కు దండలు వేయడం, కొబ్బ‌రికాయ‌లు కొడుతూ చేతి ర‌క్తం హీరోకు బొట్టు పెడుతూ పెరిగిన అభిమాని నేను. హీరోల‌ను అభిమానించే ద‌ర్శ‌కుల్లో నేను ప్ర‌థ‌ముణ్ణి. మా రోజుల్లో హెల్దీ కాంపిటీష‌న్ ఉండేది. కానీ ఈరోజు ఏమైంది. ఈరోజు నువ్వు ఫేస్‌బుక్‌లోకి రా చూసుకుందాం..ట్విట్ట‌ర్‌లో లాగిన్ అవుతావు క‌దా, చూసుకుందాం అంటున్నారు. ఈరోజు విమ‌ర్శ‌ల‌కు నేను స‌మాధానం చెప్ప‌ను. స‌మాధానం బాక్సాఫీస్ చెబుతుంది. నేను చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సినిమాలో డైలాగ్స్‌కు మంచి పేరు వ‌చ్చింది. రైట‌ర్‌గా ఎన్నారై ప్రేక్ష‌కుల‌ను శాటిస్‌ఫై చేయాలి, మాస్ ప్రేక్ష‌కుడిని శాటిస్‌ఫై ఛేయాలి. ఒక సూప‌ర్ మార్కెట్‌లో కొంద‌రు గుడ్డు కొంటే, కొంద‌రు ప‌ళ్లు కొంటారు. కానీ గుడ్లు, ప‌ళ్ళు అమ్మాల్సిన బాధ్య‌త సూప‌ర్‌మార్కెట్ ఓన‌ర్ బాధ్య‌త‌. సినిమాను వినోదం కోస‌మే చూడండి. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశం మ‌న‌ది. సినిమా చూసి ఈ సినిమాలో ఇది బాలేదు అని చెప్ప‌వ‌చ్చు. కానీ రివ్యూలు అలా ఉండ‌వు. ఈ డైరెక్ట‌ర్‌కు క‌ళ్లు నెత్తికెక్కాయ‌ని రాస్తారు. అస‌లు డైరెక్ట‌ర్‌ను విమ‌ర్శించ‌డానికి వారెవ‌రు. ప్రేక్ష‌కుడు క‌థా వ‌స్తువును విమ‌ర్శించ‌వ‌చ్చు. అంతే కానీ ఈ ద‌ర్శ‌కుడికి పొగ‌రు, క‌ళ్ళు నెత్తికెక్కాయ‌ని అంటారు. గ‌బ్బ‌ర్ సింగ్ హిట్ త‌ర్వాత కొంద‌రు నా అట్యిట్యూడ్ మారింద‌ని అన్నారు కానీ, నా అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు. ప్రేక్ష‌కుడు డ‌బ్బులు పెట్టి సినిమాకు వెళ్లే ముందు సినిమా తాలుకా టీజ‌ర్ వ‌స్తుంది. పోస్ట‌ర్‌, ట్రైల‌ర్‌, ఆడియో విడుద‌ల‌వుతుంది. మీకు న‌చ్చితే మీ స్వంత రివ్యూ మీరే ఇవ్వండి. అంతే త‌ప్పు మ‌రొక‌రి రివ్యూ చూసి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు. ఈ సినిమాకు వ‌చ్చిన డివైడ్ టాక్‌ను ప‌క్క‌న పెట్టి, నాన్ బాహుబ‌లి రికార్డ్స్‌ను కొట్టుకుంటూ డీజే సినిమా వెళుతుంది. ఈ సినిమా టాప్‌లో ఏ ప్లేస్ ఉంటుందనేది కాలం స‌మాధానం చెబుతుంది. మంచి సినిమా తీసిన‌ప్పుడు రెవెన్యూలు క‌న‌ప‌డాలే త‌ప్ప‌, రివ్యూలు క‌న‌ప‌డ‌కూడ‌ద‌ని నిరూపించిన ప్రేక్ష‌క దేవుళ్ళ‌కు న‌మ‌స్కారం. సినిమాటోగ్రాఫర్ బోస్‌గారికి థాంక్స్‌. ఇక దిల్‌రాజుగారు నాపై, మా హీరోపై న‌మ్మ‌కంతో మూడు రెట్టు ఖ‌ర్చు పెట్టి సినిమా చేసినందుకు ఆయ‌న‌కు థాంక్స్ చెప్పిన త‌క్కువే. ఆయ‌నకు సినిమాల‌పై ఉన్న ప్యాష‌న్‌కు ఆయ‌న‌కు నా పాదాభివంద‌నం. ఆయ‌న ఈ సినిమా స‌మ‌యంలో ఎంత మాన‌సిక సంఘ‌ర్ష‌న ప‌డ్డారో, త‌ప‌న ప‌డ్డారో నాకు తెలుసు'' అన్నారు.

రావు ర‌మేష్ మాట్లాడుతూ - ''ఇంత స‌క్సెస్ వ‌చ్చినందుకు హ్యాపీగా ఉంది. సాధారణంగా సినిమాల్లో న‌టించేట‌ప్పుడు ద‌ర్శ‌కుడు అడిగే ఎక్స్‌ప్రెష‌న్స్ ఏవైనా చేసేయ‌వ‌చ్చు. కానీ స‌క్సెస్ మీట్‌లో వ‌చ్చే ఎక్స్‌ప్రెష‌న్ మాత్రం ప్రేక్ష‌కుల నుండి ఆమోదం పొందాల్సిందే. రొయ్య‌ల‌నాయుడు పాత్ర నాకు క‌ల‌గా ఉంది. సినిమాలో ప్ర‌తి బిట్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. అల్లు అర్జున్‌గారికి, హ‌రీష్‌రావుగారికి థాంక్స్‌. ధిల్‌రాజుగారికి ప్రత్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. భ‌ర‌ణి, పోసాని,అయాంక బోస్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. బ‌న్నిగారు బ్రాహ్మ‌ణ క్యారెక్ట‌ర్ పుట్టిన‌ప్ప‌టి నుండి దాన్ని ఎక్క‌డో పెట్టేశారు. ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ చేశారు. చంద్ర‌మోహ‌న్ చితికి నిప్పు పెట్టే స‌న్నివేశంలో బ‌న్ని స్టార్ డ‌మ్‌నంతా ప‌క్క‌న పెట్టేసి చేసిన న‌ట‌న‌కు హ్యాట్సాఫ్‌. సినిమాను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌'' అన్నారు.

సుబ్బ‌రాజు మాట్లాడుతూ - ''చాలా రోజుల త‌ర్వాత వండ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ చేశాను. దిల్‌రాజు, శిరీష్‌, బ‌న్నికి థాంక్స్‌. ఆర్య‌, ప‌రుగు నుండి డిజె వ‌ర‌కు నేను కూడా సినిమాల్లో భాగ‌మ‌య్యాను. దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతం అందించాడు. సినిమాలోని ప్ర‌తి నటుడికి అభినంద‌న‌లు'' అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఇంకా త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, అయాంక‌బోస్‌, స‌మీర్‌, పూజా హెగ్డే, గేయ ర‌చ‌యిత బాలాజీ, ఎడిట‌ర్ ఛోటా కె.ప్ర‌సాద్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

SRK: Nothing disrespectful in 'Jab Harry Met Sejal'

Shah Rukh Khan has reacted to the censor board's disapproval of the term "intercourse" in a promotional video, saying neither he nor people associated with his upcoming film 'Jab Harry Met Sejal' need to use anything "disrespectful" to sell it.

Arjun Kapoor: I don't like showing off

Arjun Kapoor, who turned 32 on Monday, called himself an "underrated talent" at his pre-birthday celebration.

Dhanush reveals the status and reason for delay in 'Vada Chennai'

Director Vetrimaran's 'Vada Chennai' starring Dhanush in lead role, was launched in the mid of 2016 and the first part of this trilogy was supposed to be completed but things did not go as planned...

India's biggest is 'Dangal and not 'Baahubali 2'

Aamir Khan's sports drama 'Dangal' leaning on woman empowerment has now become the first Indian movie to cross the INR 2000 Crores collections largely boosted by the Chinese box office where it is a phenomenal hit. In its 53rd day in China the film has grossed 2.5 Crores where it is also the 16th all time grosser in the market. 'Dangal' is also the fifth highest grossing non-English language f

Shah Rukh Khan's ONE Rule for his kids

It has been 25 years since his first film 'Deewana' hit the screens, and the magic of Shah Rukh Khan's super stardom was there for all to see outside his bungalow Mannat on the occasion of Eid on Monday. Thousands of fans gathered to get a glimpse of the actor, who says it's this love that keeps him motivated.