అమెరికాలో దిల్ రాజు దంపతుల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ
Send us your feedback to audioarticles@vaarta.com
నిర్మాత దిల్ రాజు, వైఘా రెడ్డిని గత ఏడాది లాక్డౌన్ సమయంలో నిజామాబాద్ జిల్లాలోని ఓ గుడిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారి వివాహం జరిగి నేటికి ఏడాది అవుతోంది. వీరు తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీని వైభవంగా చేసుకోవాలని గతంలో నిర్ణయించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. తమ తొలి వెడ్డింగ్ యానివర్సరీని నేపథ్యంలో దిల్ రాజు ఆయన భార్య ఇప్పటికే అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం దిల్ రాజు దంపతులు అమెరికాలో ఉన్నారు.
Also Read: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా
కాగా.. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో మరణించిన విషయం తెలిసిందే. 10 మే 2020లో ఆయన వైఘా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. దిల్ రాజు కుమార్తె అన్షితా రెడ్డి ఆయన రెండో వివాహానికి పూర్తిగా సహకరించారు. 50 ఏళ్ల దిల్ రాజు ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ పెద్ద సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com