దిల్ రాజు ఆ ద‌ర్శ‌కుడితో సినిమా లేన‌ట్లే...?

  • IndiaGlitz, [Thursday,June 23 2016]

మెగాబ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్ తేజ్, హీరోగా విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముకుంద‌, కంచె, లోఫ‌ర్ వంటి డిఫ‌రెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇప్పుడు ఈ మెగా క్యాంప్ హీరోతో దిల్ రాజు సినిమా చేస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది. శేఖ‌ర్ క‌మ్ముల చిత్రంలో ఎన్నారై పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు.

ఈ సినిమా విష‌యాన్ని ప‌క్క‌న పెడితే దిల్‌రాజు, నూత‌న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఫీల్ మై ల‌వ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడు దిల్ రాజు ఈ సినిమా నిర్మాణం నుండి త‌ప్పుకున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే వ‌రుణ్‌తేజ్‌కు స్క్రిప్ట్ న‌చ్చింద‌ట‌. మ‌రి ఈ సినిమాను ఎవ‌రు నిర్మిస్తారో చూడాలి.