డిసెంబర్ 16న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' చిత్రాన్ని విడుదల చేస్తున్న దిల్ రాజు

  • IndiaGlitz, [Tuesday,December 06 2016]

తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నుండి సినిమా వస్తుందన్నా, ఆయన ఏదైనా సినిమాను రిలీజ్ చేస్తున్నారన్నాతప్పకుండా సినిమా ఆడియెన్స్‌ను అల‌రించే సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం అందరి మ‌దిలో ఉంది. ప్ర‌స్తుతం ట్రెండ్‌కు త‌గిన విధంగా యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌ల‌సి చూసే సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌డంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి టెస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు బ్యాన‌ర్ నుండి విడుద‌ల‌వుతున్న మ‌రో చిత్రం 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌'. ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి ప‌దేళ్లుగా మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్‌(గోపి) రీసెంట్‌గా 'సినిమా చూపిస్త మావ‌'తో సూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ల‌క్కీ మీడియా బ్యానర్‌పై భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌'.

రీసెంట్‌గా విడుదల చేసిన 'నాన్న నేను నా బాయఫ్రెండ్స్' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా చూసిన దిల్‌రాజు ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు రావ‌డంతో సినిమా స‌క్సెస్‌పై యూనిట్‌లో న‌మ్మ‌కం పెరిగింది. 'కొత్త‌బంగారు లోకం' సినిమా చూడ‌గానే నేను ఎలా ఫీల‌య్యానో 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్' సినిమా చూడ‌గానే అలానే ఫీల‌య్యాను. 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్' చిత్రం త‌ప్ప‌కుండా మ‌రో 'కొత్త బంగారు లోకం' సినిమాలా హ్యూజ్ స‌క్సెస్ సాధిస్తుంద‌ని దిల్‌రాజుగారు చెప్ప‌డం విశేషం.డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోన్న 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్' మూవీ ఆడియో రిలీజ్ డిసెంబ‌ర్ 7న జ‌ర‌గ‌నుంది. అలాగే డిసెంబ‌ర్ 8న సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 16న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌నా, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి క‌థః బి.సాయికృష్ణ‌, పాటలుః చంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యామ్‌, కొరియోగ్ర‌ఫీః విజ‌య్ ప్ర‌కాష్‌, స్టంట్స్ః వెంక‌ట్‌, స్క్రీన్‌ప్లే, మాట‌లుః బి.ప్ర‌స‌న్న‌కుమార్‌, ఎడిట‌ర్ః చోటా కె.ప్ర‌సాద్‌, ఆర్ట్ః విఠ‌ల్ కోస‌నం, మ్యూజిక్ః శేఖ‌ర్ చంద్ర‌, సినిమాటోగ్ర‌ఫీః చోటా కె.నాయుడు, ప్రొడ‌క్ష‌న్ః ల‌క్కీ మీడియా, నిర్మాతః బెక్కం వేణుగోపాల్‌(గోపి), ద‌ర్శ‌క‌త్వంః భాస్క‌ర్ బండి.

More News

అమ్మ‌కు జ‌న‌సేన నీరాజ‌నం

విప్ల‌వ నాయ‌కి, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అయిన ప్రియ‌త‌మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం న‌న్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. అనారోగ్యంతో హాస్ప‌ట‌ల్ లో చేరిన ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాల‌తో తిరిగి ఇంటికి చేరుకుంటార‌ని దేశ ప్ర‌జ‌ల‌తో పాటు నేను ఆశించాను అని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు.

మహిళా శక్తికి నిదర్శనం - డా.మోహన్ బాబు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారి ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం.

జయలలిత గారి మరణం తీరని లోటు - నందమూరి బాలకృష్ణ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి మరణవార్త నన్నెంతో కలిచి వేసింది.

యూరప్ లో 'గౌతమిపుత్ర శాతకర్ణి'

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.బ్యానర్ పై

రేపే శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్కు ఉన్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంద చిత్రాలకుపైగా నటించి కన్నడ అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ కన్నడ కంఠీరవ పార్వతమ్మ పుత్త శివరాజ్కుమార్ తొలిసారిగా నట సింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో