డిసెంబర్ 16న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' చిత్రాన్ని విడుదల చేస్తున్న దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి సినిమా వస్తుందన్నా, ఆయన ఏదైనా సినిమాను రిలీజ్ చేస్తున్నారన్నాతప్పకుండా సినిమా ఆడియెన్స్‌ను అలరించే సినిమా అవుతుందనే నమ్మకం అందరి మదిలో ఉంది. ప్రస్తుతం ట్రెండ్‌కు తగిన విధంగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ కలసి చూసే సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి టెస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు బ్యానర్ నుండి విడుదలవుతున్న మరో చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`. లక్కీ మీడియా బ్యానర్‌ను స్టార్ట్ చేసి పదేళ్లుగా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్(గోపి) రీసెంట్గా `సినిమా చూపిస్త మావ`తో సూపర్‌హిట్ సాధించిన సంగతి తెలిసిందే. లక్కీ మీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`.
రీసెంట్గా విడుదల చేసిన `నాన్న నేను నా బాయఫ్రెండ్స్` థియేట్రికల్ ట్రైలర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన దిల్‌రాజు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడంతో సినిమా సక్సెస్‌పై యూనిట్లో నమ్మకం పెరిగింది. `కొత్తబంగారు లోకం` సినిమా చూడగానే నేను ఎలా ఫీలయ్యానో `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` సినిమా చూడగానే అలానే ఫీలయ్యాను. `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` చిత్రం తప్పకుండా మరో `కొత్త బంగారు లోకం` సినిమాలా హ్యూజ్ సక్సెస్ సాధిస్తుందని దిల్‌రాజుగారు చెప్పడం విశేషం.డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతోన్న `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` మూవీ ఆడియో రిలీజ్ డిసెంబర్ 7న జరగనుంది. అలాగే డిసెంబర్ 8న సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 16న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్, కృష్ణభగవాన్, సనా, తోటపల్లి మధు, ధనరాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కథః బి.సాయికృష్ణ, పాటలుః చంద్రబోస్, భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, కాసర్ల శ్యామ్, కొరియోగ్రఫీః విజయ్ ప్రకాష్, స్టంట్స్ః వెంకట్, స్క్రీన్‌ప్లే, మాటలుః బి.ప్రసన్నకుమార్, ఎడిటర్ః చోటా కె.ప్రసాద్, ఆర్ట్ః విఠల్ కోసనం, మ్యూజిక్ః శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీః చోటా కె.నాయుడు, ప్రొడక్షన్ః లక్కీ మీడియా, నిర్మాతః బెక్కం వేణుగోపాల్(గోపి), దర్శకత్వంః భాస్కర్ బండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout