స్టార్ హీరోకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్న దిల్ రాజు?
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి తర్వాత చిత్ర పరిశ్రమలో భాషా పరిమితులు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా చిత్రాలు అంటున్నారు. టాలీవుడ్ హీరోలకు తమిళంలో అంత మంచి మార్కెట్ లేదు కానీ.. కోలీవుడ్ హీరోలకు చాలా మందికి టాలీవుడ్ లో మార్కెట్ ఉంది. రజిని, కమల్, సూర్య లాంటి హీరోలంతా తెలుగులో కూడా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు.
ఇదీ చదవండి: న్యూడ్ సీన్ కి రెడీ.. బోల్డ్ డెసిషన్ తీసుకున్న హీరోయిన్!
ఇక ఇళయదళపతి విజయ్ తమిళంలో తిరుగులేని స్టార్. ఆయనకు అక్కడ వీరాభిమానులు ఉన్నారు. సినిమా కథతో సంబంధం లేకుండా విజయ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటాయి. ఇప్పుడిప్పుడే విజయ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతోంది.
ఇదిలా ఉండగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు తమిళ ద్విభాషా చిత్రానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కోసం దిల్ రాజు విజయ్ కి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించనున్నట్లు టాక్. ఇప్పటికే దిల్ రాజు విజయ్ కి రూ.10 కోట్ల అడ్వాన్స్ చెల్లించారని మిగిలిన మొత్తం విడతల వారీగా చెల్లిస్తారని అంటున్నారు. తమిళంలో విజయ్ కి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో కూడా మార్కెట్ ఉంది. కాబట్టి వసూళ్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. అందువల్లే దిల్ రాజు విజయ్ కి రూ100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే దిల్ రాజు నిర్మాణంలో చిత్రం ప్రారంభం అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments